చంద్ర‌బాబుని జైలులో పెట్టాలి........!

రాజ‌మండ్రి: పుష్క‌రాల్లో తొక్కిస‌లాట గురించి తెలియ‌గానే ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు వైఎస్ జ‌గ‌న్ చ‌లించిపోయారు. వెంట‌నే రాజ‌మండ్రి చేరుకొని ప‌రిస్థితిని స‌మీక్షించారు. తొక్కిస‌లాట‌కు దారి తీసిన ప‌రిణామాల్ని అడిగి తెలుసుకొన్నారు. మృతుల కుటుంబాల‌కు సంతాపం తెలిపారు. చ‌నిపోయిన వారి ఆత్మ‌ల‌కు శాంతి క‌ల‌గాల‌ని ఆకాంక్షించారు. ఆ త‌ర‌వాత మీడియాతో మాట్లాడారు. వైఎస్ జ‌గ‌న్ ఏమి మాట్లాడారో........... ఆయ‌న మాట‌ల్లోనే........!
నీళ్ల‌లో దిగ‌నీయ‌కుండా భ‌క్తుల్ని ఆపేశారు. పుణ్య‌స్నానాల కోసం వ‌చ్చిన వారిని గంట‌ల త‌ర‌బ‌డి క్యూ లైన్ల‌లో ఉంచేశారు. దీంతో భ‌క్తులు ఉక్క‌పోత‌లో మ‌గ్గిపోయారు. వెన‌క్కి పోదామంటే కూడా వీలులేని ప‌రిస్థితి. రెండున్న‌ర గంట‌ల పాటు ముఖ్య‌మంత్రి పూజ‌లు చేస్తున్నాడు అంటూ లైన్ల‌లో నిలిపివేశారు. నా పూజ‌లు అయిపోయాయి, ఇక మీ ఇష్టం అంటూ చంద్ర‌బాబు ప‌చ్చ జెండా ఊపాక ఒక్క‌సారిగా జ‌నాన్ని వ‌దిలేశారు. ఇలా చంద్ర‌బాబు వెన‌క్కి వెళ్లాక, అలా ఒక్క‌సారిగా జ‌నాన్ని వ‌దిలేశారు. ఇలా చంద్ర‌బాబు వెన‌క్కి వెళ్లాక‌, అలా ఒక్క‌సారిగా బ్యారికేడ్లు తెరిచారు. ముందు ఉన్న వాళ్ల మీద వెనుక ఉన్న వాళ్లు ఒక్క‌సారిగా తోసుకొని వ‌చ్చేశారు. దీంతో తొక్కిస‌లాట జ‌రిగింది. ఇక్క‌డే 27 మంది చ‌నిపోయి ప‌డి ఉన్నారు. అక్క‌డ ఆసుప‌త్రుల్లో ప‌రిస్థితి ఏమిటో .......! దీని మీద న్యాయ విచార‌ణ జ‌రిపిస్తార‌ట‌.....! ఎందుకు, చంద్ర‌బాబుని తీసుకొని వెళ్లి జైలులో వేయాలి. వీఐపీ ఘాట్ ఉంది క‌దా. అక్క‌డ గంట‌ల త‌ర‌బ‌డి పూజ‌లు చేసుకోవ‌చ్చు క‌దా.........అయినా స‌రే, ప‌బ్లిసిటీ కోసం పుష్క‌రాల రేవులో భ‌క్తుల్ని నిలిపివేసి గంట‌ల త‌ర‌బ‌డి పూజ‌లు చేయించుకొంటారా......! ఒక్క‌సారిగా గేట్లు వ‌ద‌ల‌గానే తొక్కిస‌లాట చోటు చేసుకొంది. ఇక, దీనిమీద న్యాయ విచార‌ణ జ‌రిపిస్తార‌ట‌. ఎందుక‌ని, అధికారుల్ని బ‌క‌రాల్ని చేయ‌టానికా.....! ఏదో ఒక నెపం వాళ్ల మీద వేసి, వాళ్ల మీద‌కు తోసేయ‌చ్చు క‌దా అని ఆలోచిస్తున్నారు. పుష్క‌రాల ప‌నుల్లోకి త‌న‌ను ఇన్ వాల్వు చేయ‌టం లేద‌ని దేవాదాయ శాఖ మంత్రి స్వ‌యంగా..... చెప్పారు. చంద్ర‌బాబు నాయుడే స్వ‌యంగా ఇన్ వాల్వు అయిన‌ప్పుడు ఇక మంత్రుల‌తో ప‌ని ఏ ముంది అని ప్ర‌క‌ట‌న‌లు చేశారు క‌దా........! మొత్తం ప‌బ్లిసిటీ నాకే రావాలి అని భావించారు. ఇప్పుడు ఈ చావుల‌కు బాధ్య‌త తీసుకోవాలి క‌దా.......! మ‌నుషుల్ని ఈ విధంగా ఊచ‌కోత కోయ‌టం అంటే ఎంత దారుణం. చంద్ర‌బాబుకి మాన‌వ‌త్వం ఉంటే రాజీనామా చేయాలి, క‌నీసం కాశీ వెళ్లి అక్క‌డ గంగ‌లో మునిగి ప్రాయ‌శ్చిత్తం చేసుకోవాలి.
Back to Top