బాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు

అమరావతి: ప్రత్యేక హోదా సాధించకపోతే చంద్రబాబు చరిత్రహీనుడు అవుతారని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.  ఆయన ఎమ్మెల్యే సీట్ల పెంపు కోసం రాజ్యాంగ సవరణ చేస్తామన్న చంద్రబాబు... ప్రత్యేక హోదా కోసం ఎందుకు ముందుకు రావడం లేదని సూటిగా ప్రశ్నించారు. 

సభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, ప్రతిపక్ష ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే ముస్తఫా ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరులో డ్రైనేజీ సమస్యపై మాట్లాడేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా అవకాశం రావడం లేదని ఆయన వాపోయారు. 
Back to Top