ఘరానా రాజకీయ నేరస్థుడు చంద్రబాబు

గుంటూరు, 10 జూలై 2013:

వైట్‌ కాల‌ర్ క్రిమినల్, పొలిటికల్‌ క్రిమినల్‌ ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడే అని ఏ చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు. టిడిపి నాయకులు కారుకూతలు కూసే ముందు.. చౌకబారు మాటలు మాట్లాడే ముందు దమ్ము, ధైర్యం ఉంటే తమ విధానాల ద్వారా ప్రజల ముందుకు రావాలని సవాల్‌ చేశారు. చేవ ఉంటే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోవాలన్నారు. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్‌, టిడిపి చౌకబారు ప్రచారంపైన తీవ్రస్థాయిలో ఆయన విరుచుకుపడ్డారు. శ్రీధర్‌రెడ్డి క్రిమినల్‌ అయితే.. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ మొత్తం క్రిమినల్సు అని ఆరోపించడం సరికాదన్నారు. శ్రీధర్‌రెడ్డి నాలుగు నెలల క్రితం మాత్రమే సాధారణ కార్యకర్తగా పార్టీలో చేరాడన్న విషయాన్న కాకినాడా అర్బన్‌ తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి వివరణ ఇచ్చిన విషయాన్ని పట్టించుకోకుండా టిడిపి, కాంగ్రెస్‌ నాయకులు అవాస్తవాలు మాట్లాడడం సరికాదని ఖండించారు.

ఎవరో సంబంధం లేని వ్యక్తి తప్పు చేస్తే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టడం ఎంతవరకూ సమంజసం?‌ అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. వెనక్కి తిరిగి ఒక్కసారి మీ చరిత్రేమిటో, మీ నాయకుడి చరిత్రేమిటో తెలుసుకోవాలని చంద్రబాబు తాబేదార్లు, ఆయనకు వంతపాడే యెల్లో పత్రికలకు ఆయన హితవు పలికారు. చంద్రబాబు చరిత్ర ఏమిటని చెంబుబృందాన్ని ప్రశ్నిస్తున్నానన్నారు. యూరో లాటరీ పేరుతో మోసం చేసిన కోలా కృష్ణమోహన్‌కు మచిలీపట్నం ఎం.పి. టిక్కెట్‌ ఇవ్వడానికి చంద్రబాబు ఒప్పందం చేసుకోలేదా? అని నిలదీశారు. చంద్రబాబు కారులో దొరికిన రూ.7 కోట్ల గురించి మర్చిపోయారా? ప్రజల్లోకి వచ్చి వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ను ఎదుర్కోండి అని అంబటి రాంబాబు సవాల్‌ చేశారు.

కోలా కృష్ణమోహన్‌ నుంచి రూ.50 లక్షలకు చెక్కు రూపంలో తీసుకున్న విషయం విస్మరించారా? అని అంబటి ప్రశ్నించారు. ఆయనతో చంద్రబాబు ఫోటోలు తీయించుకున్నది, అతనని టిడిపి నాయకుడిగా గుర్తించిన విషయాన్ని మర్చిపోయి ఈ రోజు రేవంత్‌రెడ్డి అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు. చంద్రబాబు మంత్రివర్గంలో ఉన్ కృష్ణా యాదవ్‌ నకిలీ స్టాంపుల కుంభకోణంలో దొరికిపోయి ముంబాయి జైలులో శిక్ష అనుభవించిన విషయాన్ని అంబటి గుర్తుచేశారు. కృష్ణాయాదవ్‌ ఫ్లెక్సీలు కట్టిన వ్యక్తి కాదు.. చంద్రబాబుకు తెలియకుండా టిడిపి కార్యకర్తగా తిరిగిన వ్యక్తి కూడా కాదని, చంద్రబాబు ఎంపిక చేయగా గవర్నర్‌ సమక్షంలో మంత్రిగా ప్రమాణం చేసిన వ్యక్తే కుంభకోణానికి పాల్పడి బుక్కయితే.. అది మర్చిపోయారా? అని ప్రశ్నించారు.

శ్రీమతి షర్మిల పాదయాత్రలో ఎవరో ఫ్లెక్సీ కట్టిన ఒకాయన దొంగతనం చేశాడు కాబట్టి మొత్తం వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మొత్తం దొంగ పార్టీ అని ప్రచారం చేస్తున్న ‌టిడిపి నాయకులను ఏమనాలని అంబటి అన్నారు. ఈ లెక్కన నకిలీ స్టాంపులు ముద్రించింది చంద్రబాబు అనాలా? అని ఎద్దేవా చేశారు. దొంగనోట్లు ముద్రిస్తున్న వారందరికీ చంద్రబాబు నాయకుడు, గజదొంగ అనాలా? రేవంత్‌రెడ్డి చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. అనంతపురం జిల్లా కదిరిలో ఏడు కోట్ల రూపాయలు దొరికిపోయాయని, అవి చంద్రబాబు నాయుడి పేరున రిజిస్టరై ఉన్న కారులో పేరం హరిబాబు తీసుకువెళుతుండగా దొరికాయన్నారు. ఆ డబ్బులన్నీ తనవి కావని, చంద్రబాబు నాయుడివని, కావాలంటే చంద్రబాబుతో మాట్లాడిస్తానని హరిబాబు చెప్పిన విషయం మర్చిపోయారా? ఆ కేసేమైంది. చివరికి కిరణ్‌కుమార్‌రెడ్డితోనో, కాంగ్రెస్‌తోనో లాలూచీ పడి మిస్టరీగా మిగిల్సిన విషయాన్ని అంబటి ప్రస్తావించారు. చంద్రబాబు కారులో దొరికిన రూ.7 కోట్ల కేసును తక్షణమే ఈ ప్రభుత్వం బయటపెట్టి తీరాలని రాంబాబు డిమాండ్‌ చేశారు.

కాంగ్రెస్‌, టిడిపిలను వీరోచితంగా ఎదుర్కొని పోరాటం చేస్తున్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక అక్రమ కేసులు పెట్టి జైలుపెట్టి, గజదొంగగా చిత్రీకరించేందుకు కాంగ్రెస్‌, టిడిపి నాయకులు ప్రయత్నిస్తున్నారని అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. చంద్రబాబు నాయుడిని ఈ రాష్ట్ర ప్రజలు రెండు సార్లు ముఖ్యమంత్రి కాకుండా తిరస్కరించారని, మూడో సారి కూడా తిరస్కరించేందుకు సిద్ధంగా ఉన్నారని అంబటి హెచ్చరించారు. చౌకబారు విమర్శలతో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ను ఏదో చేయాలనుకుంటే అది వారి వల్ల కాదన్నారు.

ఇక కాంగ్రెస్‌ నాయకుడు వి. హనుమంతరావు కూడా సందు దొరికినప్పుడల్లా శ్రీ జగన్మోహన్‌రెడ్డి మీద, వైయస్ఆర్‌ కుటుంబం మీద విచ్చలవిడిగా లేనిపోని విమర్శలు చేయడాన్ని అంబటి రాంబాబు తప్పుపట్టారు. పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన, ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉన్న హనుమంతరావు ఏమిటీ, ఆయన చరిత్ర ఏమిటో ఒక్కసారి గుర్తుచేసుకోమని అన్నారు. రాజకీయాల్లోకి, కాంగ్రెస్‌ పార్టీలోకి రాక ముందు హనుమంతరావు ఉస్మానియా యూనివర్శిటీలో ఒక డ్రైవర్‌గా పనిచేస్తూ అక్రమంగా డీజిల్‌ను, టైర్లు కాజేసిన చరిత్ర ఆయనది అని అంబటి గుర్తుచేశారు. పిసిసి అధ్యక్షుడిగా హనుమంతరావు పనిచేశారు కాబట్టి కాంగ్రెస్‌ను ఆయిల్‌ దొంగల పార్టీ అనాలా? టైర్లు అమ్ముకునే పార్టీ అనాలా? అని సూటిగా ప్రశ్నించారు. అర్థం పర్థం లేని మాటలు మాట్లాడవద్దని, ఒక వేలు తమ వైపు చూపిస్తే నాలుగేళ్ళు విహెచ్‌ వైపే చూపిస్తాయని గుర్తుంచుకోవాలని అంబటి హెచ్చరించారు.

Back to Top