బీసీలను బాబు ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు

విజయవాడః బందర్ రోడ్డులోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ బీసీ సెల్ సమావేశం కొనసాగుతోంది. బీసీలకు జరుగుతున్న అన్యాయం, వెనుకబాటు, వారి సంక్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా వైయస్ జగన్ మాట్లాడుతూ...చంద్రబాబు బీసీలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన  ఏ ఒక్క వాగ్ధానాన్ని అమలు చేయలేదని అన్నారు. రూ.10వేల కోట్ల బీసీ సబ్ ప్లాన్ అని చెప్పి బాబు మాటతప్పారని అన్నారు. బీసీల పట్ల ప్రభుత్వం చూపుతున్న వివక్షను ప్రతి ఒక్కరికీ వివరించాలని బీసీ నేతలకు సూచించారు. అంతకుముందు కేంద్ర కార్యాలయంలో పార్టీ జెండాను ఎగరవేశారు.

Back to Top