రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్న చంద్రబాబు

ఎవరైనా ఎస్సీల్లో పుట్టాలని కోరుకుంటారా అంటూ ఓ కులాన్ని కించపర్చేలా మాట్లాడిన చంద్రబాబు ...వారికి క్షమాపణ చెప్పాలని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు.  క్షమాపణ చెప్పాకుండా అంబేద్కర్ విగ్రహం పెట్టి దండ వేస్తే మీ పాపం పోతుందా అని  బాబుపై నిప్పులు చెరిగారు. అంబేద్కర్ విగ్రహం పెడుతున్నందుకు తామంతా సంతోషిస్తున్నామని, కానీ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్న చంద్రబాబుకు విగ్రహం పెట్టే అర్హత లేదన్నారు.   పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతూ బాబు రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యేలను కొనుగోళ్లు చేయడంలో చంద్రబాబుని మించిన దిట్ట మరెవరూ లేరని మండిపడ్డారు. తెలంగాణలో ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొంటున్నారని మాట్లాడిన బాబు...ఏపీలో చేస్తున్నదేంటని ప్రశ్నించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం ధర్మమేనా బాబు అని నిలదీశారు.

Back to Top