సీఎం పనికిరాని మాటలు

విజయవాడ: ప్రతిపక్షం పట్టుబట్టి లీకేజీల అంశాన్ని చర్చకు తీసుకొస్తే ప్రభుత్వం దానిపై సమాధానాలు చెప్పకుండా పనికిరాని అంశాన్ని మాట్లాడుతోందని ఎమ్మెల్యే సునీల్‌ కుమార్‌ ధ్వజమెత్తారు. మాట్లాడిందే మాట్లాడి సీఎం సభా సమాయాన్ని వృథా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఎమ్మెల్యే సునీల్‌ మాట్లాడుతూ.. పేపర్‌ లీకేజీలపై చర్చించాల్సిందిపోయి నువ్వేం చదువుకున్నావని బాబు ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ను అడగడం బాధాకరమన్నారు. రాజకీయాల్లోకి రావడానికి పలనా చదువు చదవాలని చట్టం ఏమైనా ఉందా అని చంద్రబాబును ప్రశ్నించారు. మీ మిత్రపక్ష బీజేపీలో కేంద్రమంత్రులే 8వ తరగతి చదివిన వారు ఉన్నారని చెప్పారు. విద్యార్థుల జీవితాలను కుదిపేసే పేపర్‌ లీకేజీల అంశంలో మంత్రి నారాయణను ముఖ్యమంత్రి వెనకేసుకురావడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే సీబీఐ ఎంక్వైరీ వేసి నిజాలు బయటకు తీయాలని డిమాండ్‌ చేశారు. 

Back to Top