ఆయ‌న ఎప్పుడూ అంతే..

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు వైఖ‌రి
గురించి మ‌రోసారి ప్ర‌జ‌ల్లో చ‌ర్చ మొద‌లైంది. వివిధ అంశాల మీద ఆయ‌న మాట
మారుస్తున్న వైఖ‌రిని గుర్తు చేసుకొంటారు. తాజాగా విశాఖ‌ ఏజ‌న్సీలో
బాక్సైట్ త‌వ్వకాల‌కు అనుమ‌తి ఇవ్వ‌టం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.
టాప్ టెన్  అబ‌ద్దాలు ఇప్పుడు చూద్దాం.
1.
విశాఖ ఏజ‌న్సీలో బాక్సైట్ త‌వ్వ‌కాల్ని అడ్డుకొంటామ‌ని ప్ర‌తిప‌క్ష నేత‌గా
చంద్ర‌బాబు ప్ర‌క‌ట‌న‌లు గుప్పించారు. టీడీపీ నేత‌ల‌తో ఆందోళ‌న‌లు
చేయించారు. ఏరూపంలోనూ బాక్సైట్ వెలికితీత‌ను అంగీక‌రిచ‌బోమ‌ని తెగేసి
చెప్పారు. ఇప్పుడు బాక్సైట్ త‌వ్వ‌కాలు జ‌రిపి తీరాల్సిందేనంటూ
నోటిఫికేష‌న్ వేసేశారు. 
2. రైతులు, మ‌హిళ‌ల‌కు రుణ‌మాఫీ
చేస్తాన‌ని చెప్పారు. అధికారంలోకి వ‌చ్చాక   గ‌ట్టున పెట్టేశారు.
ప‌ట్టుమ‌ని ప‌ది శాతం మందికి కూడా రుణ‌మాఫీ అంద‌లేదు. మాయ మాట‌లు మాత్రం
కొన‌సాగుతూనే ఉన్నాయి.
3. అభివ్ర‌ద్ది చేయాలంటే పంట పొలాలు
అవ‌స‌రం లేద‌ని ఊద‌ర‌గొట్టారు. ప‌చ్చ‌ని పొలాలు లాక్కోకుండా ప్ర‌గ‌తిని
ప‌రుగులు తీయిస్తామ‌న్నారు. అధికారంలోకి వ‌స్తూనే రాజ‌ధాని పేరుతో వేల
ఎక‌రాల పంట పొలాల్ని లాక్కొన్నారు. మూడు పంట‌లు పండే ప‌చ్చ‌టి పొలాల్ని
లాక్కొని రైతుల్ని త‌న్ని త‌రిమేస్తున్నారు.
4. బంద‌రు పోర్టు
ప‌నుల‌కు రెండున్న‌ర వేల ఎక‌రాలు స‌రిపోతాయ‌ని స్వ‌యంగా చంద్ర‌బాబు
చెప్పారు. బాధితుల నిరాహార దీక్ష శిబిరాల్ని సంద‌ర్శించి సంఘీభావం
ప్ర‌క‌టించారు. ఇప్పుడు 30వేల ఎక‌రాల భూముల్ని లాక్కొనేందుకు నోటిఫికేష‌న్
వేశారు.
5. రాష్ట్రం నిల‌దొక్కుకోవాలంటే ప్ర‌త్యేక హోదా ను
ఐదేళ్లు, ప‌దేళ్లు కాద‌ని 15 ఏళ్ల పాటు ఇవ్వాల‌ని, తాము అధికారంలోకి వ‌స్తే
హోదాను ఇప్పిస్తామ‌ని వాగ్దానాలు చేశారు. కానీ అధికారంలోకి వ‌చ్చాక ఈ
హామీల‌ను తుంగ‌లో తొక్కారు. ప్ర‌త్యేక హోదా సంజీవ‌ని కాదంటూ
ద‌బాయిస్తున్నారు.
6. రైతుల‌కు విత్త‌నాల
మ‌ద్ద‌తు, నిరాటంకంగా ఇన్ పుట్ స‌బ్సిడీ, పెట్టుబ‌డుల భ‌రోసా అవ‌స‌రం అని
చంద్ర‌బాబు చాలా క‌బుర్లు చెప్పారు. అదికారంలోకి వ‌చ్చాక మాత్రం ఎక్క‌డా
రైతుల్ని ఏమాత్రం ప‌ట్టించుకోకుండా పాల‌న సాగిస్తున్నారు.
7.
ప్ర‌భుత్వ ఉద్యోగాలు దండిగా ఇస్త‌మని ఊద‌ర గొట్టారు. ఇంటికో ఉద్యోగం అంటూ
ఆశ‌లు రేపారు. తీరా అధికారంలోకి వ‌చ్చాక ఉద్యోగం అంటే ప్ర‌భుత్వ ఉద్యోగ‌మా
అంటూ సెటైర్లు వేస్తున్నారు. 
8. నిత్యావ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌లు
అదుపు చేస్తాం. అంద‌రినీ ఆదుకొంటాం అంటూ వాగ్దానాలు కురిపించారు. చివ‌ర‌కు
ధ‌ర‌ల్ని ఆకాశానికి వ‌దిలేసి సింగ‌పూర్ లెక్క‌లు స‌రిచూసుకొంటున్నారు.
9.
ఇసుక స‌హా స‌హ‌జ వ‌న‌రుల్ని ప‌రిర‌క్షిస్తామ‌ని ఊరూరా చెప్పారు. టీడీపీ
ఆధ్వ‌ర్యంలో ఆందోళ‌న‌లు చేశారు. అధికారంలోకి వ‌చ్చాక అడ్డూ అదుపు లేకుండా
టీడీపీ నేత‌లతో ఇసుక‌ను తోడేస్తున్నారు. అడ్డు వ‌స్తే రెవిన్యూ అధికారుల్ని
కొట్టించి బెదిరిస్తున్నారు.
10. బెల్టుషాపుల‌కు వ్య‌తిరేకంగా
టీడీపీ మ‌హిళా విభాగం నాయ‌కులు అనేక ప్ర‌ద‌ర్శ‌న‌లు నిర్వ‌హించారు. ఇప్పుడు
ప్రభుత్వం ఇంటింటికీ మ‌ద్యం, వీధి వీధికి బెల్టు షాపులు నిర్వ‌హిస్తోంది.
Back to Top