టీడీపీ నేతల వల్లే శాంతిభద్రతలకు విఘాతం

విజయవాడ: టీడీపీ నేతలే శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాస్‌ మండిపడ్డారు. నేరాలు చేసిన టీడీపీ నేతలపై చర్యలు తీసుకోకుండా వారిపై ఉన్న కేసులను జీవోల ద్వారా చంద్రబాబు మాఫీ చేశారని ధ్వజమెత్తారు. చంద్రబాబు తీరుతో రాష్ట్రంలో అరాచకాలు, దాడులు ఎక్కువయ్యాయన్నారు. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తన ఇంటిపై దాడి చేసినా భయపడే ప్రసక్తే లేదన్నారు. ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపితే సమాధానం చెప్పలేక ప్రతిపక్ష నాయకుల ఇంటిపై దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు.

Back to Top