కేసీఆర్ కు లొంగిపోయిన చంద్రబాబు

హైదరాబాద్ః ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు కేసీఆర్ కు లొంగిపోయి...ఐదు కోట్ల ఆంధ్రుల ప్రయోజనాలను తాకట్టుపెడుతున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ఏపీ ప్రజలకు నష్టం జరిగేలా తెలంగాణలో కేసీఆర్ ప్రాజెక్ట్ లు కడుతుంటే..దాన్ని ప్రతిఘటించకుండా బాబు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు టీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా  పనిచేస్తూ...ఏపీ ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టారని ఆగ్రహించారు. ఏపీకి జరుగుతున్న అన్యాయంపై పోరాడేందుకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కర్నూలులో ఈనెల 16 నుంచి మూడ్రోజుల పాటు దీక్ష చేపడుతున్నట్లు పేర్కొన్నారు. 

Back to Top