దళితులను అణగదొక్కుతున్న చంద్రబాబు

  • ఎస్సీల అభివృద్ధిని సీఎం కాలరాస్తున్నాడు
  • ఎస్సీ కార్పొరేషన్‌ నిధులకు అంబేద్కర్‌ ఫోటో పెట్టాలి
  • వైయస్‌ఆర్‌ సీపీకి ఓటు వేయోద్దని డబ్బులిస్తున్న టీడీపీ నేతలు
  • టీడీపీ ఎన్ని కుయుక్తులు పన్నినా శిల్పా గెలుపు తథ్యం
  • వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే నారాయణస్వామి
నంద్యాల: స్వతంత్ర రాష్ట్రంలో చంద్రబాబు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను బతకనివ్వకుండా చేస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే నారాయణస్వామి  మండిపడ్డారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో దళితులకు ఇళ్లు, భూములు, ఉద్యోగాలు ఇచ్చిన మహానుభావుడని గుర్తు చేశారు. కానీ చంద్రబాబు దళితులపై ఉక్కుపాదం మోపుతున్నారని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను టార్గెట్‌ చేసుకొని ఆర్థికంగా, విద్య పరంగా అణగదొక్కుతూ ఎస్సీల అభివృద్ధిని కాలరాస్తుడున్నాడని ధ్వజమెత్తారు. చంద్రబాబు టీడీపీ చేరనందుకు నాగసుబ్బారాయుడు అనే వ్యక్తిపై దాడి చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత నీచానీకి దిగజారిన వ్యక్తిని ఆంధ్రరాష్ట్రంలో ఏ ముఖ్యమంతిని చూడలేదన్నారు. 

ఉప ఎన్నికలు వస్తేనే అభివృద్ధి చేస్తారా..?
కేంద్ర ప్రభుత్వం 85 శాతం ఇస్తున్న ఎస్సీ కార్పొరేషన్‌ నిధులను టీడీపీ నేతలకు ఇస్తూ తన ఫోటో పెట్టుకొని చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నాడని నారాయస్వామి విరుచుకుపడ్డారు. కేంద్ర ఇస్తున్న కార్పొరేషన్‌ నిధులకు అంబేద్కర్‌ ఫోటో పెట్టాలని డిమాండ్‌ చేశారు. చంద్రన్న కానుకల పేరుతో నిధులను దారి మళ్లిస్తున్నాడని విమర్శించారు. నంద్యాలలో వైయస్‌ఆర్‌ సీపీ పోటీ పెట్టకుండా ఉంటే నంద్యాలలో ఇంత మంది టీడీపీ నేతలు పర్యటించేవారా అని ప్రశ్నించారు. అన్ని నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల్లో వస్తేనే అభివృద్ధి చేస్తారా అని నిలదీశారు. చంద్రబాబు రాష్ట్ర ప్రజల పట్ల కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాడని దుయ్యబట్టారు. శిల్పా మోహన్‌రెడ్డిని ప్రతిపక్ష అభ్యర్థిగా నిలబెట్టే సరికి చంద్రబాబులో వణుకు వచ్చిందన్నారు. మనిషిగా పుట్టిన వారెవరూ మంత్రి సోమిరెడ్డిలా మాట్లాడరని ఆరోపించారు. వంద మందిని పెట్టుకొని ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ జై కొట్టించుకుంటున్నాడని సోమిరెడ్డి మాట్లాడడాన్ని ఆయన ఖండించారు. ఒక్కో బూతుకు రూ. 50 వేలు కేటాయిస్తూ వైయస్‌ఆర్‌ సీపీకి ఓటు వేయోద్దని డబ్బులిస్తూ టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రజాధరణ మెండుగా కలిగిన వైయస్‌ జగన్‌ అనే శక్తిని ఎవరూ ఆపలేరన్నారు. రాజకీయ బిక్ష పెట్టిన ఆదినారాయణరెడ్డి వైయస్‌ కుటుంబంపై విమర్శలు చేయడం సరికాదని విరుచుకుపడ్డారు. ఆదినారాయణరెడ్డి ఒకసారి నీ చరిత్రను తిరిగి చూసుకోవాలన్నారు. వైయస్‌ జగన్‌ ఫోటో పెట్టుకొని గెలిచిన నీకు నిజంగా మానవత్వం ఉంటే వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు ఎన్ని కుయుక్తులు పన్నినా శిల్పా మోహన్‌రెడ్డి గెలుపు తథ్యమన్నారు.
Back to Top