ప్రతిపక్షం గొంతునొక్కుతూ టీడీపీ అరాచకత్వం

()ఇష్టారాజ్యంగా సభను నడుపుకుంటున్న అధికారపక్షం
()వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలపై మార్షల్స్ తో దాడి చేయిస్తున్న బాబు
()అసెంబ్లీ లోపల, వెలుపల ప్రతిపక్షం గొంతు నొక్కుతున్న టీడీపీ
()వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలను మాట్లాడనీయకుండా కుట్రలు 
()మీడియా పాయింట్ వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్ః ప్రతిపక్ష వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలపై చంద్రబాబు సర్కార్ దాడులకు, దౌర్జన్యాలకు దిగుతోంది. అసెంబ్లీలోనూ, వెలుపల  ప్రతిపక్షం గొంతు నొక్కుతూ చంద్రబాబు సర్కార్ దుర్మార్గంగా ప్రవర్తిస్తోంది. ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్ష అయిన ప్రత్యేకహోదా కోసం చర్చించాలని వైయస్సార్సీపీ మూడు రోజులుగా పట్టుబడుతుంటే...పారిపోయిన ప్రభుత్వం మార్షల్స్, పోలీసులతో వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలపై దాడులు చేయిస్తోంది.ఎమ్మెల్యేలన్న కనీస గౌరవం కూడా లేకండా సభనుంచి మార్షల్స్ తో గెంటివేయించడం దారుణం. 

సభ సమావేశాలు ప్రారంభమవ్వగానే చంద్రబాబు అసెంబ్లీలోపల మార్షల్స్ ను పెట్టించారు. ప్రత్యేకహోదాపై ఆంధ్రుల హక్కు నినాదంతో వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలు శాంతియుతంగా నిరసన చేపట్టారు. ఐతే, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను తిట్టేందుకు టీడీపీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు మైక్ ఇస్తున్న స్పీకర్...ప్రజాసమస్యలు, ప్రత్యేకహోదాపై చర్చ కోరుతున్న ప్రతిపక్షానికి మాత్రం మైక్ ఇవ్వడం లేదు. ప్రతిపక్ష నేతకు అరనిమిషం కూడా మైక్ ఇవ్వకపోవడం దుర్మార్గమని ఎమ్మెల్యేలు మండిపడ్డారు. 

మహిళా ఎమ్మెల్యేలను మార్షల్స్ తో సభనుంచి భయటకు తోసేయడం దుర్మార్గం. ఇష్టారాజ్యంగా సభను నడుపుకుంటున్న చంద్రబాబు...కనీసం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కూడా వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలను మాట్లాడనివ్వడం లేదు. మీడియాపాయింట్ వద్ద హోదామీద మాట్లాడుతున్న వైయ్ససార్సీపీ ఎమ్మెల్యేలను టీడీపీ నేతలు, పోలీసులు ఎమ్మెల్యేలను అడ్డుకోవడం దారుణమని వైయ్ససార్సీపీ ఎమ్మెల్యేలు అన్నారు. ప్రత్యేకహోదా మీద మాట్లాడేందుకు ప్రతిపక్షానికి చంద్రబాబు మైక్ ఇవ్వకపోవడం అప్రజాస్వామికమని ఎమ్మెల్యేలు అన్నారు. హోదాపై చర్చ అంటే ఎందుకు భయపడుతున్నారని బాబును నిలదీశారు.  

Back to Top