అదేం గ్రహబలమో..బాబు ఉలిక్కిపడ్డాడు

 • గవర్నర్‌ చెప్పిన విషయాలే చంద్రబాబు మళ్లీ చెప్పారు
 • వరుస కరువులొస్తే..ఏపీ జీడీపీ 12.23 శాతమట
 • బాబు కేసును సుప్రీం కోర్టు టేకప్‌ చేసింది
 • సుప్రీం కోర్టు సీఎంకు నోటీసులు ఇవ్వడం చాలా పెద్ద విషయం
 • ఓటుకు కోట్లు కేసును పక్కదారి పట్టించేందుకు బాబు ప్రయత్నం
 • రైతులకు మేలు జరగాల్సిన చోట టీడీపీ నేతలకు లబ్ధి
 • మంత్రి పల్లె కుమారుడికి ప్లాట్‌ కేటాయింపు అధర్మం
 • తప్పును కవర్‌ చేయడానికి అందరు ఏకమయ్యారు
 • తప్పు చేసిన వాళ్లను జైలుకు పంపుతామన్నది తప్పా?
 • వైయస్‌ఆర్‌ బతికున్నంత వరకు నాపై ఒక్క కేసు లేదు
 • వైయస్సార్సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్

హైదరాబాద్‌: గవర్నర్‌ నరసింహన్‌తో చంద్రబాబు అబద్ధాలు చెప్పించడం బాధాకరమని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. ఇవాళ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్‌ ప్రసంగంపై వైయస్‌ జగన్‌ మీడియాతో క్లుప్తంగా మాట్లాడారు.  అలాగే ఓటుకు కోట్లు కేసుకు సంబంధించి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేయడం, రాజధాని ప్రాంతంలో రైతులకు, టీడీపీ నేతలకు ప్లాట్ల కేటాయింపులు, బస్సు ప్రమాదంలో ప్రభుత్వం, అధికారులు అసుసరించిన విధానాన్ని ప్రతిపక్ష నేత ఎండగట్టారు. వైయస్‌ జగన్‌ మీడియాతో ఏమన్నారంటే..  గవర్నర్‌ ప్రసంగంపై క్లుప్తంగా చెప్పాలంటే..ఒకవైపు కరువు వచ్చిందని అందరికి తెలుసు. బాబు సీఎం అయిన నాటి నుంచి వరుసగా కరువే కరువు..మరి ఒకవైపు కరువుతో అల్లాడుతుంటే అభివృద్ధి గ్రోత్‌ రేటు..అభివృద్ధి ఉందా? లేదా అని మిమ్మల్నే అడుగుతున్నాను. బాబు మాత్రం రాష్ట్ర అభివృద్ధిలో దేశం కన్నా ఎక్కువట. దేశంలో 7.1 శాతమట. ఏపీలో 12 శాతమని చెబుతున్నారు. ఎంత దారుణంగా చంద్రబాబు చెవ్వుల్లో పువ్వులు పెడుతున్నారు. దీనిగురించి సుదీర ్ఘంగా మాట్లాడుతాను. ఇంక బాధాకరమైన విషయం ఏంటంటే. గవర్నర్‌ నోటి నుంచి అబద్ధాలు చెప్పించారు. బాబు ఏదైతే రాయించారో అదే చదివి వినిపించారు. ప్రభుత్వం ఏదైతే చెప్పమంటారో అదే గవర్నర్‌ ప్రసంగిస్తారు. ఆ ప్రసంగించడంలో గవర్నర్‌ నోటితో అబద్ధాలు చెప్పించడం బాధాకరం. 
ఇంకా బాధపడే విషయం ఏంటంటే..ప్రత్యేక హోదా అన్నది ఈ మార్చి నుంచి వెళ్లిపోతుందట. నిజంగా వెళ్లిపోతుంటే బాబుకు ఒక ప్రశ్న వేస్తున్నాను. జీఎస్‌టీ యాక్ట్‌లో అమైన్‌మెంట్‌ తీసుకొని వస్తున్నారు. జీఎస్‌టీ వచ్చినా కూడా ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల్లో కొనసాగుతుంది. గవర్నర్‌ స్పీచ్‌లో ఇదంతా మేం ప్రస్తావిస్తాం.

ప్లాట్ల కేటాయింపుల్లో పారదర్శకత లేదు
రాజధాని ప్రాంతంలో రైతులకు కేటాయించిన ప్లాట్లలో పారదర్శకత లేదని వైయస్‌ జగన్‌ అన్నారు.  ఈ రోజు మనం పేపర్లో చూశాం. రాజధానిప్రాంతంలో రైతులకు ఏ రకంగా అన్యాయం జరుగుతోంది. ప్లాట్ల కేటాయింపుల్లో ఏ రకంగా వ్యత్యాసం చూపుతున్నారో అర్థమవుతోంది. లాటరీ అని చెబుతున్నారు. ఈ ప్లాట్లు ఇచ్చినవి ఎంత ఆశ్చర్యకరంగా ఉన్నాయంటే...బాబుకు సంబంధించిన వారికి మాత్రం బ్రహ్మాండమైన స్థలాల్లో మంజూరు చేశారు. కమర్షియల్‌ ప్రాంతాల్లో, కూడలిలో అలాట్‌మెంట్‌ చేశారు. సామాన్యులకు ఇక్కడ చోటు దక్కలేదు. ఇటువంటి నాయకులకు మంచి ప్లాట్లు లాటరీలో ఎలా దక్కుతాయి. మిగిలిన వారికి దక్కకపోవడం ఏంటీ. పయ్యావుల కేశవ్, దుళిపాల నరేంద్ర వీరిద్దరికి ప్లాట్లు అలాట్‌ అయ్యాయి. 12 వేల గజాలు ఒక ప్లాటు మంజూరు చేశారు. ఈ  ప్లాటు ఎక్కడుందో చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. పయ్యవుల కేశవ్, నరేంద్రకు నివాస ప్లాట్లు, వీరికి నాలుగు వైపులా ప్లాట్లు, కమర్శియల్‌ జోన్‌లో కేటాయించారు. వీరు రాజధాని ప్రాంతంలో భూములిచ్చారా? ఇలాంటి ప్లాట్లు రైతులకు ఇస్తే వారు బాగుపడరా? ఇది ధర్మమేనా? మంత్రి పల్లె రఘునాథరెడ్డి కుమారుడు కిశోర్‌రెడ్డికి నేలపాడులోని కాలనీ 451లో నివాస ప్లాట్లకు సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు పక్కనే మంజూరు చేశారు.ప్రభుత్వ షాపింగ్‌ కాంప్లెక్స్‌కు ఆనుకొని వీరికి ప్లాట్లు. స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ పీఏ గుత్తా లలిత్‌కుమార్‌కు వెలగపూడిలోని వాణిజ్య ప్లాట్లకు తూర్పున సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు పక్కనే కేటాయించారు. వాళ్ల ప్లాట్లు ఎక్కడ వస్తున్నాయో లే అవుట్లు వేసుకున్నారు. రైతులకు మేలు జరగాల్సిన చోట పల్లె కుమారుడికి, స్పీకర్‌ బినామీకి, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మేలు చేసేలా ప్లాట్లు కేటాయించారు. లక్ష్మీ సౌజన్య..ఈమె గుంటూఉ ఎమ్మెల్యే ఆంజనేయులు కూతురు..ఈమెకు కాలనీ 628లో ప్లాట్లకు ఇరువైపుల రోడ్లు, ఈ ప్రాంతంలో కేటాయించారు. వేగలపూడిలో మూడు ప్లాట్లు, వీటికి వంద గజాల రోడ్లు. లాటరీ పద్ధతిలో పారదర్శకత ఉందా? లాటరీని సైతం, కంప్యూటర్‌ను సైతం మీ ఇష్టం వచ్చినట్లు మార్పు చేసుకొని మంచి ప్లాట్లను మీరు కేటాయించుకుంటున్నారు. మీపై ప్రాండ్‌ కేసు పెడితే తప్ప ఇలాంటివన్ని వెలుగులోకి రావు.

రాజధాని ప్రకటనలో కూడా ఇలాగే..
 చంద్రబాబు దగ్గరుండి తనకు సంబంధించిన వ్యక్తులకు మేలు చేస్తున్నారు. రాజధాని విషయంలో కూడా నాగార్జున యూనివర్సిటీ, నూజివీడు అని చెప్పాడు. తీరా బాబు తన బినామీలతో భూములు కొనుగోలు చేయించిన తరువాత రాజధాని అక్కడ కాదు ఇక్కడ అని ప్రకటించారు. అక్కడితో ఆగిపోలేదు..తనకు సంబంధించిన భూములను మాత్రం ల్యాండ్‌ పూలింగ్‌ నుంచి తప్పించారు. బాబు ఉంటున్న లింగమనేని గెస్టు కూడా ఇందులో నుంచి తప్పించారు. తనకు సంబంధించిన మనషులు, తన బినామీలు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసుకునేందుకు జోనింగ్‌ మొదలు పెట్టారు. ఇందులో తనకు సంబంధించిన భూములు మాత్రం రియల్‌ ఎస్టేట్‌ జోన్‌లో పెట్టారు. మిగిలిన రైతులు పోటీకి రాకుండా ఉండేందుకు అగ్రీ జోన్‌లో పెట్టారు. ఈ ప్రాంతంలో మేలు చేశారా? చెడు చేశారా? అర్థం కావడం లేదు. ఇవాళ అసెంబ్లీలోకి వెళ్లాను. శ్రావణ్‌కుమార్‌  నావద్దకు వచ్చి అసెంబ్లీ భవనానికి ఎవరైతే భూములిచ్చారో వారంతా ఆనందంగా భూములిచ్చినందుకు విందు ఏర్పాటు చేశామన్నారు. ఇక్కడ అన్ని టెంపరరీ నిర్మాణాలే. రేపు శాశ్వత భవనాలు కడితే ఇక్కడ హెరిటేజ్‌ కంపెనీ పెడతారు. సెక్రటరేట్‌ పక్కన ఉంటే భూములకు ధర వస్తుంది. టెంపరరీ నిర్మాణం అంటున్నారు. మూడేళ్లలో పర్మినెంట్‌ నిర్మాణాలకు ఒక్క ఇటుక కూడా వేయలేదు. అవి ఎక్కడ నిర్మిస్తారో ఎవరికి తెలియదు. ఏ సినిమా బాగుంటే అలా అసెంబ్లీ అంటారు. ఏ దేశం వెళ్తే అక్కడిలాగా నిర్మిస్తానంటారు. ఎలా ఉంటాయో ఎవరికి తెలియదు. ఏమి చేసినా టెంపరరీ అంటారు. ఒక అడుగులో ప్లాట్‌ కట్టడానికి రూ.1500 సరిపోతుంది. టెంపరరీ అసెంబ్లీకి అడుగుకు రూ.10 వేలు దాటిపోయింది. ఇంతటి దారుణంగా పరిపాలన సాగిస్తున్నారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి.

అదేం గ్రహబలమో..
ఓటుకు కోట్లుకు సంబంధించి ఇవాళ జరిగిన పరిణామాలు చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. బాబు ఏదైతే రాయించి ఇస్తారో గవర్నర్‌ అదే చదివి వినిపిస్తారు. అదే సబ్జెట్‌ మీదా చంద్రబాబు మాట్లాడటం ఇంతవరకు ఎక్కడ జరగలేదు. కరెక్టుగా 11.06 నిమిషాలకు గవర్నర్‌ ప్రసంగం మొదలుపెట్టించారు. అదేం గ్రహబలమో ఏమో తెలియదు 11.10 నిమిషాలకు సుప్రీం కోర్టులో బాబుకు నోటీసులు ఇచ్చింది. వెంటనే బాబు ఉలిక్కిపడ్డాడు. వెంటనే బాబు మైక్‌ అందుకుని గవర్నర్‌ ప్రసంగాన్ని సుదీర్ఘంగా చెప్పారు. కేసులకు సంబంధించి చాలా తేలికగా చెప్పారు. వాస్తవం ఏంటంటే..ఒక ముఖ్యమంత్రి మీద సుప్రీం కోర్టు కేసు విన్నతరువాత కేసును అడ్మిట్‌ చేసుకొని నోటీసులు ఇవ్వడమన్నది పెద్ద విషయం. ఇది చాలా పెద్ద అంశం. ఇలాంటి దాన్ని డైవర్ట్‌ చేయడానికి చాలా కష్టపడ్డాడు. అందులో ప్రతిమాటలో కూడా ఆ వాయిస్‌ తనది కాదు అనలేదు. మన వాళ్లు బ్రీప్డ్‌మీ అన్నది నేను కాదు అనలేదు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి టోటల్‌గా నల్లధనం ఇస్తూ దొరికిపోయిన చరిత్ర దేశంలో ఎక్కడ లేదు. అలా జరిగినా రాజీనామా చేయకుండా సీఎంగా కొనసాగడం ఎక్కడ లేదు. ఒక్క చంద్రబాబు విషయంలోనే జరిగింది. 26 కేసులు మాములుగానే పెట్టారని చెబుతున్నారు. ఎక్కడా కూడా ఆ గొంతు నాది కాదు అనడం లేదు. ఆ కేసుల్లో ఏ కేసు కూడా విచారణ స్థాయికి పోలేదు. ఆమాట ఎక్కడ అనడు. వెంటనే చాకచక్యం తన పలకుబడి, మేథ సంపత్తుతో విచారణను అడ్డుకుంటారు. ఇది చంద్రబాబు టాపిక్‌ డైవర్ట్‌ చేసేందుకు చాలా కష్టపడ్డారు. ప్రజల చెవ్వుల్లో పూలు పెట్టవచ్చు అన్నది బాబు ఆలోచన.
 
జీడీపీ ఎలా సాధ్యం బాబూ?
రాష్ట్ర జీడీపీ 12.23 శాతం  ఉందని, దేశంలోనే ఏ రాష్ట్రానికి లేదని చంద్రబాబు చెప్పించారు. ఈ జీడీపీ చూస్తే  ఆశ్చర్యకరంగా ఉంది. బెంగుళూరు వంటి నగరం కలిగిన కర్నాటకలో 6.2 శాతం, ముంబై లాంటి పెద్ద సిటీ ఉన్న మహారాష్ట్ర 8 శాతం, గుజరాత్‌ ఎంతో తెలుసా 7 శాతమే. ఎక్కడా ఈ జీడీపీ లేదు. వరుసగా కరువుతో ఉన్న రాష్ట్రంలో ఈ స్థాయిలో జీడీపీ ఉందని చెబుతున్నారు. వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగంలో ఈ స్థాయిలో అభివృద్ధి సాధించామని చెబుతున్నారు.

ప్రశ్నిస్తే చాలు తప్పుడు కేసులు..
శాంతిభద్రతలు అన్నది బాబుకే తెలియాలి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైన మాట్లాడితే దాన్ని జీర్ణించుకునే పద్ధతి లేదు. వెంటనే తప్పుడు కేసులు పెట్టడం జరుగుతోంది. ప్రజాస్వామ్యం అన్నది ఎప్పుడు బాగుంటుందంటే..అధికారంలో ఉన్న వ్యక్తి తన గురించి, తన ప్రభుత్వం గురించి మాట్లాడింది వినగలుగుతారో అప్పుడే మంచి నాయకుడు కాగలడు. హిట్లర్‌ లాంటి పెద్ద పెద్ద నాయకులను చూశాం. అధికారం ఉందని ఏమైనా చేయవచ్చు అన్నట్లు కళ్లు నెత్తిన పెట్టుకుని వ్యవహరిస్తున్నారు. ప్రజస్వామ్యంలో ప్రజలే మెట్టికాయలు వేస్తారు.

దోషం రుజువు కాకుండానే 
మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. నేరం రుజువు కానంత వరకు మూడు నెలల్లో బెయిల్‌ ఇచ్చి బయటకు పంపించాలి. అది చట్టం చెబుతోంది. నా విషయానికి వస్తే..వైయస్‌ జగన్‌ అన్న వ్యక్తి లేకపోతే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉండదని చంద్రబాబు, కాంగ్రెస్‌ నేతలు ఇద్దరు కలిసి చేసిన కుట్ర. రాజకీయంగా నాపై కేసులు పెట్టారు. వైయస్‌ఆర్‌ బతికున్నంత వరకు కేసులు లేవు. కాంగ్రెస్‌లో ఉన్నంత వరకు నాపై కేసులు లేవు. కాంగ్రెస్‌ను ఎప్పుడైతే వీడారో అప్పుడు చంద్రబాబు కాంగ్రెస్‌తో టై ఆప్‌ అయ్యారు. కిరణ్‌ సర్కార్‌పై అవిశ్వాసం పెట్టినప్పుడు చంద్రబాబు విప్‌ జారీ చేసి సపోర్టు చేశారు. విప్‌ జారీ చేసినా లెక్క చేయకుండా కొడాలి నాని ఓటు వేశారు. ఆ విధంగా నాపై కేసులు వేశారు, తెలుగు కాంగ్రెస్‌ అనే ప్రభుత్వాన్ని నడిపించారు. ఒక్క వ్యక్తి దోషం రుజువు కాకుండా జైల్లో 16 నెలలు పెట్టారు. 

బాధితులకు భరోసా కల్పించేందుకు వెళ్లాను
నిన్న జరిగిన ఘటన కూడా ఇలాగే ఉంది. బస్సు ప్రమాదంలో 11 మంది చనిపోతే సీఎం వెళ్లి వారికి భరోసా ఇవ్వాలి. కారణం ఆ బ స్సు టీడీపీ ఎంపీది కాబట్టి అక్కడికి వెళ్తే చంద్రబాబును నిలదీస్తారని అక్కడికి వెళ్లలేదు. బాధితులకు భరోసా కల్పించేందుకు నేను వెళ్లాను. నేను అక్కడికి వెళ్లినప్పుడు బంధువులు తెలియజేసిన విషయాలను మీడియా సమక్షంలోనే ఆ ప్రశ్నలు వేశాను. ఒక్క బస్సు ప్రమాదం జరిగితే ప్రభుత్వం ఆ ప్రయాణికులకు తోడుగా నిలబడాలి. బస్సు యాజమాన్యం నుంచి బాధితులకు రూ.20 లక్షలు పరిహారం ఇప్పించాలి. కానీ  ఇక్కడ జరిగిన విషయాలు చెబుతున్నాను. కల్వర్టును ఢీకొట్టి 20 అడుగుల లోతు గుంతలో పడింది. ఇక్కడ రెండో డ్రైవర్‌ లేడు. ఏమయ్యాడని మీడియా ఎదుటే అడిగాను. డ్రైవర్‌ తాగి ఉన్నాడా అంటే తెలియదన్న సమాధానం. ప్రమాదంలో 30 శాతం బస్సు ముందు భాగం డ్యామెజ్‌ అయ్యింది. రెండో డ్రైవర్‌ డిక్కిలో పండుకున్నాడని చెబుతున్నారు. 20 అడుగుల పై నుంచి కింద పడినా ఆ మనిషి ఎలా బతికారు. అది వాస్తవమా? అక్కడికి వెళ్తే ప్రయాణికుల నుంచి సందేహాలనే నేను ప్రశ్నించాను. ఆసుపత్రికి వెళ్లేలోగానే నాలుగు బాడీలను పంపించేశారు. ఆసుపత్రికి రాగానే కలెక్టర్, పోలీసులే నన్ను పెద్ద హాల్‌లోకి తీసుకెళ్లారు. మార్చురీలోకి తీసుకెళ్లలేదు. పోస్టుమార్టం థియేటర్‌లోకి తీసుకెళ్లలేదు. శవాలను మూటకట్టి పంపించేందుకు సిద్ధం చేశారు. నేను ఎప్పుడైతే అక్కడికి వెళ్లానో శవాల రూపంలో ఉన్న బాడీలు, అక్కడే బంధువులు ఉన్నారు. అక్కడున్న వారిలో ఎవరో ఒకరు డ్రైవర్‌ బాడీ సార్‌ ఇది అన్నారు. డ్రైవర్‌ బాడీకి పోస్టుమార్టం చేశారా అని అడిగాను. డాక్టర్‌ వెంటనే జోబులోనుంచి ఒక రిపోర్టు చూపించారు. సార్‌ పోస్టుమార్టం చేసేందుకు వేరే డాక్టర్‌ వస్తారట అని చెప్పారు. ఆ మాటలకు వెంటనే అధికారులు భయపడ్డారు. ఒక తప్పును కనబడకుండా చూసేందుకు ఇంతమంది ఏకమైయ్యారు. చనిపోయిన కుటుంబాల గురించి వీరికి ఆలోచన లేదు. నిజంగా ఇంత తప్పులు జరుగుతుంటే..వాటిని చూపించాలి.  తప్పును కవరప్‌ చేసేందుకు ఇన్నిన్ని కుయుక్తులు చేస్తున్నారు. ప్రోటోకాల్‌ ప్రకారం ఉన్నతాధికారి కిందిస్థాయి అధికారి వద్దకు వెళ్లి ప్రశ్నించడం తప్పా? ఏ సంఘటన జరిగినా ప్రతిపక్షం పోకూడదు. ఇలా జరిగితే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుంది. రేపు మీరు రాసిన రాతలకు కూడా ఇదే కేసులు పడుతాయి. బంధువులు అడిగిన ప్రతి పక్ష మీడియా ముందే అధికారులను అడిగాను. అంతవరకు పోస్టుమార్టం అయిపోయిందని బాధిత కుటుంబాలను ఒత్తిడి చేశారు. నాకు దివాకర్‌రెడ్డిపై ఎందుకు కోపం. ఎవరి బస్సు ప్రమాదం జరిగినా నేను వెళ్లేవాడిని. 11 మంది చనిపోతే అక్కడికి వెళ్లడం నా బాధ్యత. వాస్తవం చెప్పాలంటే చంద్రబాబు అక్కడి వెళ్లి ఉండాలి. అంత స్పీడ్‌గా వచ్చి ఢీ కొట్టిందంటే వంద అడుగులు బస్సు ఎగిరిందంటే ఎంత వేగంతో పోతుందో అర్థం చేసుకోవచ్చు. నిరుడి సంవత్సరం కేశినేని, ఇవాళ దివాకర్‌ ట్రావెల్స్‌. ఇలా వరుస ప్రమాదాలు జరగడం బాధాకరం. 

బాధితులను ఆదుకోవాలన్న ఆలోచన కలెక్టర్‌కు రాలేదు
కలెక్టర్‌ బాధిత కుటుంబాలు న్యాయం చేయాల్సిన వ్యక్తి. వారికి రూ. 20 లక్షల పరిహారం ఇప్పించాలన్న ఆలోచన బాధ్యత గల కలెక్టర్‌కు రాలేదు. అక్కడ ఉండి కలెక్టర్‌ ఎలా దోషులను కాపాడాలని ఆలోచన చేస్తున్నారు. బాధ్యత గల ప్లేస్‌లో ఉండి దగ్గరుండి తప్పులు చేయిస్తుంటే మీరంతా కూడా జైలుకు పోతారు అన్నాను. విచారణ అంతా కూడా ఏకపక్షంగా చూపిస్తున్నారు. బాధితులకు అన్యాయం చేస్తున్నారు..ధర్మమేనా అని మీడియా సమక్షంలోనే అన్నాను. బాధ్యత గల ప్లేస్‌లో ఉన్న వ్యక్తి నా ముందే ఈ విధంగా అన్యాయం చేస్తుంటే ఇలాంటి వాళ్లను జైలుకు పంపుతామని అనడం తప్పా?  జేసీ ప్రభాకర్‌రెడ్డి అనే వ్యక్తి  వల్గర్‌ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారని మీరే చెబుతున్నారు. గజరాజు వెళ్తుంటే కుక్కలు మొరుగుతుంటాయి. ఇలాంటి విషయాలపై నేను మాట్లాడను.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top