నాశనం మొదలైందిలా..!

గుంటూరు: రాజధాని శంకుస్థాపన పనుల కోసం చంద్రబాబు ప్రభుత్వం బోలెడంత హడావుడి చేస్తోంది. శంకుస్థాపన కు వచ్చే ఇతర రాష్ట్రాల పెద్దలు, కేంద్ర స్థాయి నేతల దగ్గర ప్రశంసలు పొందేందుకు చాలా ఆర్భాటం చేస్తున్నారు. దీంతో స్థానికుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

గుంటూరు జిల్లా ఉద్ధండ రాయుని పాలెం వేదికగా శంకుస్థాపన కార్యక్రమం చేపడుతున్నారు. ఇందుకోసం చక చక ఏర్పాట్లు చేస్తున్నారు. వేదిక కు చేరుకొనేలా మూడు మార్గాలలో రహదారుల్ని విస్తరిస్తున్నారు. కొన్ని చోట్ల ప్రత్యేక రహదారుల్ని నిర్మిస్తున్నారు. ఇందుకోసం వందల ఎకరాల్లో పంట ను నాశనం చేస్తున్నారు. విరివిగా అరటి తోటలు, పండ్ల తోటల్ని నాశనం చేస్తూ నిర్మాణాలు చేస్తున్నారు.

కనీసం రైతులకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా తోటల నరికివేత జరిగిపోతోంది. అదేమని అడిగితే రైతులకుసరైన సమాధానం లభించటం లేదు. ఈ సీజన్లో పంటలు వేయవద్దని ముందే చెప్పామని, అయినా వినకుండా పంట సాగు చేయటం వల్లనే సమస్య వచ్చిందంటూ దబాయిస్తున్నారు. దీంతోరైతులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే సెక్షన్ 144, 30 పేరుతో గ్రామాల్లో పెద్ద ఎత్తున పోలీసుల్ని మోహరించటంతో వ్యవసాయ దారులు భయపడిపోతున్నారు. మొత్తం మీద రాజధాని పేరుతో పంటల నాశనం అన్నది శంకుస్థాపన సమయంలోనే మొదలు పెట్టారన్న మాట.
Back to Top