చంద్రబాబు రాజీనామా చేయాలి - ఎంపి విజయసాయిరెడ్డి

ఢిల్లీ :  తెలుగుదేశం పార్టీ రాజ్యసభ, లోకసభ సభ్యులందరూ రాజీనామా చేస్తే, తమ పార్టీ అధ్యక్షులు ఆదేశిస్తే తామందరం కూడా రాజీనామాలకు సిద్ధమని వైయస్ ఆర్ కాంగ్రెస్ ఎంపి వి.విజయసాయిరెడ్డి అన్నారు.  పార్లమెంటులో ఇచ్చిన హామీ చట్టబద్దమైనదనే అని, దానిని అమలుచేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని రాజ్యసభసభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా కోసం ఎంపిలుచేస్తున్న ఆమరణ దీక్షకు మద్ధతుగా ఢిల్లీలో వైయస్ ఆర్ కాంగ్రెస్ నాయకులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి  మీడియాతోమాట్లాడారు. యుపిఎ ప్రభుత్వం గతంలోనే ఇచ్చిందనీ దానిని అమలు చేయాల్సింది ఎన్ డిఎ ప్రభుత్వమే అని స్పష్టం చేశారు. 
గతంలో తాను అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా ప్రత్యేక హోదాను  14 వ ఆర్ధిక సంఘం వ్యతిరేకించిందని ఆర్ధిక మంత్రి ఒక సమాధానం ఇచ్చారన్నారు. ఆర్ధిక సంఘం అనేది కేవలం సిఫారసు చేయగలదే కానీ, నిర్ణయం తీసుకునే అధికారం లేదన్నారు. అంతే కాకండా 14 వ ఆర్ధిక సంఘం ఎక్కడా ప్రత్యకే హోదా ఇవ్వవద్దని ఎక్కడా చెప్పలేదని వివరించారు. ప్రత్యేక హోదా అనేది ఆరక్ధిక సంఘం పరిథిలో రానే రాని పరిస్థితుల్లో , కేంద్రం తీసుకున్న నిర్ణయం 
రాజ్యాంగ విరుద్ధమైనటువంటి, ఆంధ్ర రాష్ట్రానికి వ్యతిరేకంగా తీసుకున్నట్లుగా భావించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రబుత్వం ప్రత్యేక హోదాను ఎందుకు కాదనాల్సి వచ్చింది. ప్రత్యేక ప్యాకేజిని ఎందుకు అంగీకరించాల్సి చ్చిందో రో చంద్రబాబు గారు చెప్పాలని డిమాండ్ చేశారు.  హోదా అవసరం లేదు,. సంజీవిని కాదు ప్రాణవాయువు కాదంటూ. కేంద్రంతో ఎందుకు లాలూచి పడాల్సి వచ్చింది సూటిగా ప్రశ్నించారు. 
తమ స్వప్రయోజనాల కోసం హోదాను తుంగలోకి తొక్కారు. హోదా విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తప్పులు   ఈ రెండు ప్రభుత్వాలు రాష్ట్ర ప్రజలకు  రెండూ ద్రోహం చేశాయన్నారు. వీటికి సరైన సమయంలో  ప్రజలు బుద్ది చెపుతారు.
రాజ్యసభ సబ్యులు రాజీనామా ఎందుకు చేయలేదంటూ టిడిపివారు డిమాండ్ చేయడంలో అర్ధం లేదని, రాష్ట్రానికి ద్రోహం చేసిన చంద్రబాబు , ఆయన మంత్రివర్గం మొదట రాజీనామాలు చేయాలన్నారు. టిడిపికి చెందిన లోకసభ, రాజ్యసభ సభ్యులందరూ రాజీనామాలు చేస్తే, తమ పార్టీ అధ్యక్షులు ఆదేశిస్తే రాజ్యసభ సభ్యులు కూడా రాజీనామా చేయడానికి సిద్ధం అని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

Back to Top