చంద్రబాబు మనసు రిపేర్ చేసుకో

ముఖ్యమంత్రి సిగ్గుతో తలదించుకోవాలి
మహిళల గురించి మాట్లాడే హక్కు బాబుకు లేదు
ఆశావర్కర్ల ఉద్యోగాలు ఊడగొట్టారు 
అంగన్ వాడీలపై ఉక్కుపాదం మోపారు
డ్వాక్రా అక్క,చెల్లెమ్మలను మోసం చేశారు
మహిళను వేధించినా మంత్రిపై చర్యలు లేవు
అసెంబ్లీ వేదికగా బాబును ఎండగట్టిన వైఎస్ జగన్


అసెంబ్లీః చంద్రబాబుకు మహిళల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అన్నారు.  కోడలు మగ పిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా అంటూ , ఆడవాళ్లపై వివక్ష చూపిన ఈపెద్దమనిషి...అక్క, చెల్లెమ్మల సమానత్వం గురించి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. టీడీపీ చేస్తున్న అన్యాయాలను అసెంబ్లీలో ప్రస్తావిస్తే... చంద్రబాబు తన మంత్రులు, ఎమ్మెల్యేలను పురమాయించి తమను తిట్టించడమే పనిగా పెట్టుకున్నారని  వైఎస్ జగన్  ఫైరయ్యారు. 

మంత్రి రావెల కిషోర్ బాబు కుమారుడు ఓ మహిళ పట్ల దారుణంగా ప్రవర్తిస్తే .... స్థానికులు అతన్ని కొట్టి పోలీస్ స్టేషన్ లో అప్పగించారని, దానికి కూడా జగనే కుట్ర చేశాడని రావెల మాట్లాడడం దుర్మార్గమన్నారు. ఇలాంటి మంత్రిని పదవిలో కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి సిగ్గుతో తలదించుకోవాలని వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.  ఇదే చట్టసభలో ఉన్నఓ ఎమ్మెల్యే ఒక ప్రోగ్రాంలో అమ్మాయిల గురించి లోకువగా మాట్లాడాడు. జాతీయ మీడియాలో కూడా దానిపై చర్చ జరుగుతోందని అన్నారు. మైక్ ఉందని మంత్రులు, అధికారపార్టీ నేతలు  ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం సరికాదని, మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలన్నారు. అప్పుడే వ్యవస్థ బాగుపడుతుందన్నారు. ముందుగా చంద్రబాబు తన మనసు రిపేర్ చేసుకోవాలని హితవు పలికారు. 

చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆశావర్కర్ల ఉద్యోగాలు ఊడగొట్టారు. అంగన్ వాడీలపై ఉక్కుపాదం మోపారు. పెంచిన జీతాలు ఇవ్వమని అడిగడమో నేరమన్నట్లు వారిని ఉద్యోగాల్లోంచి తీసేయమని సర్క్యులర్ పంపించాడు. డ్వాక్రా మహిళలకు రూ. 1383 కోట్ల రూపాయలు వడ్డీలు కట్టానన్న బాబు..ఇప్పుడేమైనా మొదలుపెట్టారా అని జననేత తూర్పారబట్టారు. చంద్రబాబు రాకముందే డ్వాక్రామహిళలకు వడ్డలేని రుణాలు ఉండేవని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. బాబు తన హయాంలో 12 నుంచి 14 శాతం వడ్డీలు విధిస్తే.. మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి డ్వాక్రా అక్కా,చెల్లెమ్మలకు పావలా వడ్డీకే రుణాలు ఇచ్చారన్నారు. ఆతర్వాత దాన్ని వడ్డీలేని రుణాల కింద మార్చారని చెప్పారు. 

రూ. 14,200 కోట్లు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు ....అధికారంలోకి వచ్చాక మాఫీ మాటలే మాట్లాడడం లేదని దుయ్యబట్టారు. ముష్టివేసినట్లు  కేవలం రూ. 3 వేలు ప్రకటించి...అది కూడా పెట్టుబడి కోసం అప్పిస్తానని మాట్లాడడం దారుణమన్నారు. ఎవరూ వడ్డీలు కట్టొద్దంటూ ఎన్నికల ముందు చెప్పి అక్క, చెల్లెమ్మలను బాబు మోసం చేశాడని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు చేసిన పాపానికి....డ్వాక్రా మహిళల దగ్గర బ్యాంకులు రూ.2 వడ్డీలు వసూలు చేస్తున్నాయన్నారు. కేవలం 12.42 శాతం మాత్రమే డ్వాక్రా గ్రూపులు ఎ రేటింగ్‌లో ఉన్నాయని సెర్ప్ తెలిపింది. గ్రేడ్ డిలో 52.31 శాతం ఉన్నాయి. చంద్రబాబు మీ సెర్ప్ వైబ్ సైట్ లో డ్వాక్రా అక్క, చెల్లెమ్మల పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి చూసుకోవాలని చురక అంటించారు. 

మహిళల భద్రత కోసం స్పెషల్ క్యాబ్ లు అని చంద్రబాబు మాట్లాడడం విడ్డూరమన్నారు.  మల్టీ నేషనల్ కంపెనీలు స్పెషల్ క్యాబ్ లు తెప్పించుకుంటుండడంతో కేంద్రం భద్రత కట్టుదిట్టం చేసింది. ప్రతి క్యాబ్ లో జీపీఎస్  పెట్టి కంపెనీకి మార్గదర్శకాలు నిర్దేశించింది. చంద్రబాబు చెప్పే వ్యవస్థ ఆల్రెడీ ఉంది.  జీఎమ్మార్ ఎయిర్ పోర్ట్ లో షీక్యాబ్స్  పేరుతో తెలంగాణ కూడా  దీన్ని అమలు చేస్తోంది. అదేదో తానే కొత్తగా చేస్తున్నట్లు, తన బుర్రలో వచ్చిన వినూత్నమైన ఆలోచన అన్నట్లు బాబు చెప్పడం శోచనీయమని వైఎస్ జగన్ విరుచుకుపడ్డారు. 
Back to Top