హైదరాబాద్ః ఆంధ్రప్రదేశ్‌లో కొందరి ఎమ్మెల్యేల పరిస్థితి అనాధాల మాదిరిగా తయారైందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా....నియోజకవర్గాల్లో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉందని ఆరోపించారు. మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ... ఇప్పటి వరకు చంద్రబాబు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించలేదని మండిపడ్డారు. నియోజకవర్గంలో కనీసం ఒక్క బోరు కూడా వేయించే పరిస్థితిలో ప్రభుత్వం లేకపోవడం దుర్మార్గమన్నారు. <br/>తెలంగాణలో కేసీఆర్ అక్కడి ప్రతిపక్ష ఎమ్మెల్యేల పట్ల ఎటువంటి విధానాలను అవలంభిస్తున్నారో, ఏ విధంగా నిధులు కేటాయిస్తున్నారో చూసి ....చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవాలని సునీల్ కుమార్ హితవు పలికారు.