'జగన్ దీక్షతోనైనా ప్రభుత్వం దిగిరావాలి'

ఒంగోలు: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దీక్షతోనైనా ప్రభుత్వం దిగిరావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఒంగోలులో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతిపక్ష నేతగా జగన్‌కు నిరసన తెలియజేసే హక్కు ఉందన్నారు. నాలుగు రోజలు యోగాలో ఉండటం వల్ల ప్రభుత్వమంతా కోమాలోకి పోయిందని ఎద్దేవా చేశారు. యోగాకు తాము వ్యతిరేకం కాదని, అది వ్యక్తిగత వ్యవహారమని చెప్పారు. మహాత్మాగాంధీని  హత్యచేసిన గాడ్సేను ప్రజలు అసహ్యించుకుంటుంటే ప్రస్తుత ప్రభుత్వాలు విగ్రహాలు ప్రతిష్టిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
Back to Top