ఎదురుదాడి చేయడమే మీ సిద్ధాంతమా..?

హైదరాబాద్ః
కాల్ మనీ సెక్స్ రాకెట్  కేసు నుంచి టీడీపీ నేతలను తప్పించేందుకు
చంద్రబాబు ప్రయత్నించడం దుర్మార్గమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్
రెడ్డి మండిపడ్డారు. స్వయంగా బాధిత మహిళలే వచ్చి టీడీపీ నాయకుల పేర్లు
చెబుతుంటే...వాటిని మిగతా పార్టీలకు అంటకట్టడం సిగ్గుచేటని శ్రీకాంత్
రెడ్డి మంత్రి యనమలపై ఫైరయ్యారు. ఎప్పుడు కూడా చేసిన తప్పులను ఒప్పుకోకుండా
 ప్రతిపక్షంపై ఎదురుదాడే సిద్ధాంతమన్నట్లు ప్రవర్తించడం బాధాకరమన్నారు.

వందలాది
మహిళల్ని వేధించి వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన టీడీపీ నేతలను
వెనకేసుకొస్తూ చంద్రబాబు కాల్ మనీ వ్యవహారాన్ని డైవర్ట్ చేస్తున్నారని
శ్రీకాంత్ రెడ్డి  ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్స్ రాకెట్ లో ఉన్న వారందరినీ
ప్రజల ముందు నిలబెట్టాలని శ్రీకాంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్
చేశారు. 
Back to Top