శవాల మీద పేలాలు ఏరుకున్న చందాన

చంద్రబాబు మోసాలు
ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు తూట్లు
రైతులు,మహిళలు,నేత కార్మికులకు వెన్నుపోటు

హైదరాబాద్ః
వైఎస్సార్సీపీ సీనియర్ నేత పార్ధసారథి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో నిప్పులు
చెరిగారు. చంద్రబాబు ప్రభుత్వం మరో వర్గాన్ని మోసం చేసేందుకు తయారయిందని
పార్ధసారథి అన్నారు. చేనేత రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం
చేతగానీ మాఫీ చేయడానికి పూనుకుందని విమర్శించారు. లక్షా 15 వేలమంది చేనేతలు
రూ.365 కోట్ల మేర రుణాలు బ్యాంకులకు బకాయిలు పడినట్టు కోటయ్య కమిటీకి
అధికారులు నివేదించారని పార్ధసారథి చెప్పారు. కానీ, చంద్రబాబు వాటిని
రూ.110 కోట్లకు తగ్గించి మోసం చేస్తున్నారన్నారు. ఎంతసేపు ప్రజలకు ఏవిధంగా
కోతలు కోయాలి, భారం వేయాలన్నదే తప్ప ఎక్కడ సహాయపడాలన్న ఆలోచనే చేయడం లేదని
చంద్రబాబుపై ధ్వజమెత్తారు. ఒక్క రూపాయి కూడా రుణాలు మాఫీ చేయకుండా
చేసినట్టు చంద్రబాబు సన్మానాలు చేయించుకోవడం సిగ్గుచేటన్నారు. 

చేనేత
కార్మికులకు ...బ్యాంక్ రుణాల మాఫీ, పవర్ లూమ్ లపై ఉన్న రుణాలు రద్దు,
ఒక్కో చేనేత కుటుంబానికి రూ.లక్ష మేర సంస్థాగత రుణసౌకర్యం, వేయి కోట్లతో
ప్రత్యేక నిధి, బడ్జెట్ లో ప్రతి సంవత్సరం వేయి కోట్ల రూపాయలు కేటాయింపులు,
రాష్ట్రవ్యాప్తంగా నేత బజార్లు ఏర్పాటు, మగ్గాలకు ఉచిత విద్యుత్ ఇస్తామని
ఆశలు కల్పించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.... చేనేతలకు మొండిచేయి
చూపిస్తున్నారని పార్ధసారథి మండిపడ్డారు. శవాల మీద పేలాలు ఏరుకున్న
చందాన... చంద్రబాబు రైతులు, మహిళలు, చేనేత కార్మికులకు రుణాలు ఎగ్గొట్టి
 సొంత విలాసాలకు ఖర్చుపెట్టుకోవడం దౌర్భాగ్యమన్నారు.   

దివంగత
ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి  ప్రజలకు ఇంకా మంచి చేయాలన్న తపనతో
...ఎన్నికల్లో ఇవ్వని హామీలు కూడా నెరవేర్చారని పార్ధసారథి ఈసందర్భంగా
గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మరణించిన ప్రతి చేనేత కార్మికుడి
కుటుంబానికి రూ. లక్షా 50 వేలు పరిహారం ఇచ్చేందుకు వైఎస్. రాజశేఖర్ రెడ్డి
119 జీవో తీసుకొచ్చారని చెప్పారు. అదేవిధంగా చేనేతల వయసును  60 నుంచి 50
ఏళ్లకు తగ్గించి  పెన్షన్ పొందే వీలు కల్పించారన్నారు. నేత కార్మికులకు
 రూ. 312 కోట్ల రుణాలను మాఫీ చేసిన ఘనత రాజశేఖర్ రెడ్డిదని పార్ధసారథి
తెలిపారు. 
కానీ, చంద్రబాబు రైతులు, డ్రాక్రా సంఘాలు, నేత
కార్మికులకు రుణాలు మాఫీ చేయకుండా మోసపుచ్చుతున్నారని పార్ధసారథి ఆగ్రహం
వ్యక్తం చేశారు. 

రైతుల రుణమాఫీ సంగతేమోగానీ వడ్డీలు కూడా మాఫీ అయిన దాఖలాలు లేవన్నారు. కుండపోత వర్షాలతో రైతులు పంటలు
కోల్పోయి తీవ్రంగా నష్టపోతే వారిని ఆదుకోకుండా ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు. గతంలో
తుపాన్ తాలుకు పరిహారాన్ని ఇప్పటివరకు చెల్లించకపోగా ...తమ ప్రభుత్వ హయాంలో
లేని వాటిని చెల్లించమని వ్యవసాయ శాఖ మంత్రి నిస్సిగ్గుగా మాట్లాడడం
సిగ్గుచేటన్నారు. చెరకు రైతులకు చెల్లించాల్సిన పర్చేజ్ ట్యాక్ ను
ఎగ్గొట్టే దౌర్భాగ్య పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని ఫైరయ్యారు. మోసం చేసినా
ఎవరూ ఏమీ చేయలేరనే కుట్రపూరిత ఉద్దేశ్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా రుణాలన్నీ మాఫీ చేయాలని డిమాండ్
చేశారు. 

తాజా వీడియోలు

Back to Top