ఈ ఫ‌లితాలు బాబుకు గ‌ట్టి షాక్‌

ఉరవకొండ:  పశ్చిమ రాయలసీమ పట్టభుద్రల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైయ‌స్‌ఆర్ సీపీ బలపరిచిన అభ్యర్థి వెన్నపూసగోపాల్‌రెడ్డి సమీప టీడీపీ అభ్యర్థి కెజేరెడ్డి పై 14వేల పై చిలుకు ఓట్లతో గెలుపొందడంతో ఉరవకొండలో వైయ‌స్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. స్థానిక కవితా హోటల్‌ సర్కిల్‌ నుండి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం క్లాక్‌టవర్‌ వద్ద అంబేద్కర్‌ విగ్రహనికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. నాయకులు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చుతూ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ తిప్పయ్య, పార్టీ రాష్ట్ర కార్యదర్శిలు బసవరాజు, అశోక్, మండల, పట్టణ కన్వీనర్లు నరసింహులు, తిమ్మప్ప, ఉపసర్పంచ్‌ జిలకరమోహన్‌లు మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభధ్రుల‌, ఉపాధ్యాయులు అధికార టీడీపీకు దిమ్మ తిరిగే షాక్‌ను ఇచ్చారని తెలిపారు. రాయలసీమ పట్టభధ్రుల‌ ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి విజయం ప్రజా విజయం అని తెలిపారు. స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నికల్లో రూ. కోట్ల కొద్ది డబ్బు వెదజల్లి ఎంపీటీసీలు, జడ్పీటీసీలను కొనుగోలు చేసి వక్రమార్గాన గెలుపొందిన టీడీపీ పార్టీకి ప‌ట్ట‌భ‌ధ్రుల‌ ఎన్నికల ఫలితాలు చంద్రబాబుకు షాక్‌ ను ఇచ్చాయని తెలిపారు. సంబరాల కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఎసీ ఎర్రిస్వామి, చేనేత విభాగం జిల్లా కమిటీ సభ్యులు చెంగలమహేష్, గట్టుర్రిస్వామి, జిల్లా కమిటీ సభ్యులు లత్తవరంగోవిందు, నిరంజన్‌గౌడ్, మైనార్టీ విభాగం జిల్లా సహాయ కార్యదర్శిలు హుసేన్‌అహ్మద్, శర్మాస్, వార్డు సభ్యులు ప్రసాద్, రాజ, వెంకటేష్, మల్లి, జోగి వెంకటేష్, భీమన్న, నింబగల్లు నాయకులు చిదంబరి, హనుమప్ప, బూదగెవి ధనంజయ, ఉరవకొండ పట్టణ అభివృద్ధి కమీటి అధ్యక్షులు ఎర్రిస్వామి, సభ్యులు శ్రీనివాసరెడ్డి, మూలగిరిపల్లి ఓబన్న, ఇంద్రావతి రాజ్‌కుమార్‌లు పాల్గొన్నారు.

Back to Top