నిఘా వర్గాల సమాచారంతో బాబులో వణుకు

నంద్యాలః  నంద్యాల ఉప ఎన్నికల్లో ఓటమి ఖాయమని తేలడంతో గుడ్డకాల్చి ఎదుటివారిపై వేసే ప్రయత్నం చేస్తోందని వైయస్సార్‌ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. నిఘా వర్గాల సమాచారంతో చంద్రబాబుకు వణుకు పుట్టిందన్నారు. వాడవాడలా టీడీపీ గుండాలు ప్రజలను బెదిరిస్తూ ప్రలోభాలకు గుర్తిచేస్తున్నారని మండిపడ్డారు. నంద్యాలలో ఏం జరుగుతుందో ప్రజలందరికీ తెలుసునని అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఇక్కడ ఏం చేస్తున్నారో అందరూ చూస్తున్నారని తెలిపారు.

నంద్యాల ఎన్నికల ప్రచారంలో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ స్వయంగా డబ్బులు పంచుతూ దొరికిపోయారని, ఇంకా సిగ్గులేకుండా చంద్రబాబు ఎదుటివారిపై ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తమను బదనాం చేసే కుట్రలో భాగంగానే చంద్రబాబు నంద్యాల వస్తున్నారన్నారు. మూటలు మూటలుగా వందల కోట్లు తెచ్చి అడ్డగోలుగా పంచి ఎన్నికల వాయిదా వేయించాలని చంద్రబాబు పన్నాగం పన్నారని ఆరోపించారు. అందుకే ప్రచారం పేరుతో నంద్యాలకు చంద్రబాబు వస్తున్నారని అన్నారు. చంద్రబాబు, ఆయన మంత్రులు ఎన్ని కుట్రలు చేసినా వైయస్సార్‌ సీపీదే విజయమని అంబటి రాంబాబు విశ్వాసం వ్యక్తం చేశారు.
Back to Top