మూడేళ్లుగా అవే గొప్పలు

  • రొటిన్‌గా గవర్నర్‌ ప్రసంగం
  • ప్రతి ప్రసంగంలోనూ ప్రభుత్వం గొప్పలే కనిపిస్తున్నాయి
  • పడికట్టు పదాలు ఆనవాయితీగా వస్తున్నాయి
  • -బాబు అధికారంలోకి వచ్చిన ఈమూడేళ్లలో కరువే కరువు
  • అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై చర్చలో వైయస్ జగన్ వ్యాఖ్యలు
 ఏపీ అసెంబ్లీ: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో నిర్మించిన కొత్త సభలోనైనా ప్రతిపక్షం గొంతు నొక్కొద్దని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే ప్రసంగంపై మంగళవారం అసెంబ్లీలో వైయస్‌ జగన్‌ మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. కొత్తగా ప్రారంభించిన అసెంబ్లీ భనవంలో అత్యున్నత విలువలకు గౌవరం దక్కాలని కోరుతున్నాను. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ..ఆయన ప్రసంగాన్ని ఒక్కసారిగా గమనిస్తే..రోటిన్‌గా గత మూడేళ్లుగా ఏ ప్రసంగం విన్నా ఒకేమాదిరిగా ఉంది. గవర్నర్‌ తన ప్రసంగం రాసుకొని వచ్చి తన మనసులోని మాటలు చదవడం లేదు. ముఖ్యమంత్రి రాయించి ఇచ్చినవే ప్రసంగిస్తున్నారు. ప్రభుత్వం ఎంతో గొప్పగా సాధించామని, స్వల్పకాలంగా ఎన్నో పనులు చేశామని, దీర్ఘకాలంగా 2050 అని కూడా చెప్పేస్తున్నారు. ఇలా పడికట్టు పదాలతో గొప్పలు చెప్పడం అనవాయితీగా జరుగుతోంది. రాష్ట్ర ప్రజల కష్టాలను, నష్టాలను, తమ గొంతు ఎత్తి మాట్లాడలేని వారి తరఫున ఏకైక ప్రతిపక్షంగా మాట్లాడుతున్నాం. ప్రభుత్వం తన ఘన కార్యాలు అని ఏవిధంగా చెప్పుకుంటున్నారో దానిపై చర్చించడం మా  బాధ్యత. ఇటువంటి పరిస్థితుల్లో నా ప్రసంగాన్ని అడ్డుకోకుండా, ప్రశాంతంగా వినే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని, నిమిషానికి ఒకసారి నా మైక్‌ కట్‌ చేయకుండా కొత్త భవనంలోనైనా అలాంటి సంప్రదాయానికి స్వస్తి చెప్పాలని, పార్లమెంట్‌ సంప్రదాయానికి విలువ ఇస్తారని ఆశిస్తు ఈ ప్రసంగాన్ని ముందుకు తీసుకెళ్తున్నాను. 

అధ్యక్షా..మన రాష్ట్రం ఎటువంటి పరిస్థితుల్లో విడిపోయిందో అందరికి తెలిసిందే.. మన రాష్ట్రం ఎటువంటి దారణమైన పరిస్థితుల్లో విడిపోయిందో తెలిసి కూడా..మనం అంటున్న మాటలు 2015–2016కు సంబంధించి 10.99 గ్రోత్‌రెటు నమోదు చేశామని చెప్పారు. ఇది ఒక్కటే రెండంకెల వృద్ధి రేటు అంటున్నారు. 2016–2017లో దాన్ని అధిగమించి మొదటి ఆరు నెలలకే 12.23 జీడీపీ సాధించామని చెబుతున్నారు. ఇది చాలా గొప్ప పాలన అని వైయస్‌ జగన్‌ ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌ వంటి మహానగరం మనకు దూరమైన తరువాత మన రాష్ట్రం అభివృద్ధి గురించి దేశం కంటే రెట్టింపు పథంలో దూసుకెళ్తున్నామన్నారు. 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. మన రాష్ట్రం మొత్తంగా వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో అన్నింటికి విలువ కడితే దాన్ని అభివృద్ధి చెందామని చెబుతాం. లేదంటే తిరోగమనం అని చెబుతాం. 2015–2016లో ఏపీ 10.99 జీడీపీ చూపిస్తుంటే దేశం 7.55 శాతం చూపించారు. దేశం కన్న రాష్ట్రం 3.42 శాతం ఎక్కువ అని గొప్పలు చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ గొప్పలు ఇంకా ఎక్కువ చెప్పుకున్నారు. దేశం కన్నా దాదాపు 5 శాతం వృద్ధి రేటు అంటున్నారు. ఎంతగొప్పగా అంటున్నారంటే చెన్నైతో కూడిన తమిళనాడులో 8.79, బెంగుళూరుతో కూడిన కర్నాటకలో 6.20 శాతమే, మహారాష్ట్రలో 8 శాతమే, గుజరాత్‌లో 7.7 శాతమే. నిజంగా చంద్రబాబు ఆధ్వర్యంలో 10.99 శాతం..వారేవా..అంటూ ఎద్దేవా చేశారు. ఇంత ఘనంగా వృద్ధి రేటు ఎలా వచ్చిందో అది దేవ రహస్యం. జీఎస్‌డీపీ గ్రోత్‌రేటు అంటే అది మూడురంగాలకు సంబంధించిన అభివృద్ధిని సూచిస్తోంది.

వ్యవసాయం, పారిశ్రామిక, సేవారంగం మూడింటినీ పరిగణలోకి తీసుకొని జీఎస్డీపీ గ్రోత్ రేటుని నిర్ణయిస్తాం. ఈ మూడు రంగాలను గమనిస్తే...మొదటగా వ్యవసాయరంగం జీఎస్ డీపీలో దాదాపు 29 పర్సంట్ కాంట్రిబ్యూట్ చేస్తోంది.  2015-16కు సంబంధించి మన జీఎస్ డీపీ ఎంత అన్నది 6లక్షల 3వేల కోట్లుగా ఆర్థికమంత్రి యనమల చెప్పారు.  అన్ని రంగాలు కలిపి 6 లక్షల 3వేల కోట్లు అయితే...అందులో లక్షా 70వేల కోట్లు వ్యవసాయరంగానికి సంబంధించి కాంట్రిబ్యూషన్. ముఖ్యమంత్రి గ్రోత్ రేటును గొప్పగా చెబుతూ ఆక్వారంగం అభివృద్ధిలో పరుగెత్తిందని 2015-16కు సంబంధించి చెప్పారు. ఈ సంవత్సరం 42 శాతం రాబోతుందని చెప్పారు. మొత్తంగా  ఆక్వా రంగం కాంట్రిబ్యూషన్ సోషియో అకనామిక్ సర్వే ప్రకారం 2015-16కు సంబంధించి కేవలం 30వేల99 కోట్లు. 5.4 పర్సంట్ మాత్రమే కాంట్రిబ్యూట్ చేసే చిన్న సెక్టార్ లో... 15-16కు సంబంధించి వచ్చిన 30వేల కోట్లలో 14వేల కోట్లు ఎక్స్ పోర్టు ఆదాయం వచ్చిందని  చెప్పారు. 

201-15-16 మెరైన్ ప్రాడక్ట్స్ ఎక్స్ పోర్టు అథారిటీ నోడల్ ఎజెన్సీ ప్రకారం...2014-15లో 5.4 డాలర్లు కేజీ ఉంటే..15-16కు వచ్చేసరికి 4.9డాలర్లకు పడిపోయింది. రొయ్యలు 40 శాతం క్వాంటిటీ పరంగా, 60శాతం వాల్యూపరంగా కాంట్రిబ్యూట్ చేస్తుంది. రొయ్యలు 2014-15లో 10.38 డాలర్లు కేజీ ఉంటే 15-16కు వచ్చేసరికి 8.2 డాలర్లకు పడిపోయింది. దేశవ్యాప్తంగా ఎంపెడ లెక్కల ప్రకారం చూస్తే 14-15కు సంబంధించి 33వేల 441కోట్లు మెరైన్ ఎక్స్ పోర్ట్స్ వస్తే 15-16కు వచ్చేసరి 30వేల 420కోట్లకు పడిపోయింది. 30వేల 420కోట్ల రూపాయల్లో మన రాష్ట్రానికి సంబంధించి 14వేల కోట్లున్నాయి. 45 పర్సంట్ కు సంబంధించిన పరిస్థితి ఏమిటి...? రేటు తగ్గించిన పరిస్థితి కనిపిస్తోంది. నిరుడు కన్నా ఈ ఏడాది రేటు తక్కువగా ఉంది. అదే మాదిరి బాబు 15-16కు సంబంధించి 31 పర్సంట్ గ్రోత్ రేటు నమోదు చేశామని చెబుతున్నారు. అందుకే 11శాతం గ్రోత్ రేటు వచ్చిందని డబ్బాలు కొట్టుకుంటున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాకముందు 13-14కు సంబంధించి ఫిషరీస్ అక్వాకల్చర్ లో వచ్చిన గ్రోత్ రేటు 27.92 పర్సంట్. ఇది చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక హఠాత్తుగా వచ్చిందేమీ కాదు. అంతకుముందు కూడా ఇది నమోదు అవుతుందని క్లియర్ కట్ గా అర్థమవుతోంది. అక్వా కల్చర్ లో ప్రొడక్షన్ పరంగా గ్రోత్ రేటు ఏవిధంగా ఉందంటే...12-13లో 15.88 లాక్ టన్స్ , 13-14లో 17.69 లక్షల టన్నులు, 14-15లో 19.78లక్షల టన్నులు,  15-16లో20లక్షల టన్నులు. ప్రతి సంవత్సరం మెరైన్ టోటల్ ప్రొడక్షన్ పెరుగుతూ వచ్చింది.  రొటిన్ గా జరుగుతున్న దాన్నే బాబు తన ఘనకార్యం వల్లే జరిగిందని భూతద్దంలో చూపించుకుంటున్నాడు. డబ్బాలు కొట్టుకుంటున్నాడు. బీకాంలో ఫిజిక్స్ చదివిన వాళ్లకైతే నా లెక్కలు అర్థం కావు అని ప్రభుత్వ తీరును తూర్పారబట్టారు.  

చంద్రబాబు గ్రహబలమేమోగానీ... రైతుల పంటలకు మద్దతు ధర దేవుడెరుగు, ఆయన ముఖ్యమంత్రి అయ్యాక చేపలకు కూడ ధరలు రాకుండా పోతున్నాయి. గత మూడేళ్లుగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాక కరువే కరువు. ఎంత దారుణమైన కరువంటే..వర్షాలు ప్రతీ ఏటా తక్కువగా నమోదవుతున్నాయి. రబీ పంటకు సంబంధించి నార్మల్ గా ప్రతి సంవత్సరం 24.63 లక్షల హెక్టార్టలో పంటలు వేస్తాం. కానీ ఈమూడేళ్లలో ఏనాడు పండలేదు. ఈ సంవత్సరం 19 లక్షల హెక్టార్లలో మాత్రమే పంటలు వేశారు. 2016ఖరీఫ్ లో సకాలంలో వర్షాలు  పడకపోవడంతో ఏకంగా 10లక్షల హెక్టార్లలో పంట ఎండిపోయిన పరిస్థితని చూశాం. ఇదే సమయంలో బాబు రెయిన్ గన్స్ అన్నారు. నాలుగురోజుల్లో కరువును పారదోలామన్నారు. వర్షంతో యుద్ధమన్నారు. రెయిన్ గన్స్ ను కొనడానికి వీళ్లు రూ.160కోట్లు ఖర్చుపెడితే పదిరోజులు ఆపరేటింగ్ కోసం రూ.103 కోట్లు ఖర్చు చేశారు. వాటివల్ల ఎకరా కూడ బతకలేదు. పంటలు ఎండిపోయాయి. అనంతపురంలో 63మండలాలు పూర్తిగా కరువుమండలాలుగా డిక్లేర్ చేశారు. రెయన్ గన్ లు పూర్తిగా ఫెయిలయ్యాయి. 5లక్షల ట్రాక్టర్లు అందుబాటులో లేకపోవడం. అన్ని రాష్ట్రాల నుంచి తెచ్చుకున్న అన్ని ఉండవేమో. మనకు 664మండలాలున్నాయి. 2014-15లో 238మండలాలుగా డిక్లేర్ చేశారు.15-16లో 359 మండలాలు, 16-17లో 301 మండలాలు కరువు మండలాలుగా డిక్లేర్ చేశారు. కరువు మండలాలను డిక్లేర్ చేసినప్పుడు ఏరైతు అయినా ఆశించేది ఏమంటే..రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్రంతో మాట్లాడుతుందని, సహాయం వస్తుందని, రుణాలు రీ షెడ్యూల్ అవుతుందని ఆశిస్తారు. ఈమూడేళ్లలో ఒక్క సంవత్సరం కూడా రుణాల రీషెడ్యూల్ కాలేదు. కరువు మండలాలను డిక్లేర్ చేసినప్పుడు ఇన్ పుట్ సబ్సిడీ వస్తుందని ఆశిస్తారు. బాబు ఎన్నికల ముందు జల్, లైలా తుపాన్ బాధితులకు ఇన్ పుట్ సబ్సిడీ ఇస్తామని చెప్పారు. 13-14లో రూపాయి ఇవ్వలేదు. కేంద్రం ఇచ్చిన వాటాను దాన్ని డైవర్ట్ చేశారు. 14-15కు సంబంధించి 1500కోట్లు ఇవ్వాలని కలెక్టర్లు చెబితే 1067కోట్లకు క్యాబినెట్ లో తగ్గించారు. మళ్లీ క్యాబినెట్ లో 693కోట్లకు తగ్గించారు. ఇవాళ్టికి కూడా 30కోట్లు బకాయిలున్నాయని వైయస్ జగన్ అన్నారు. 

పరిశ్రమలకు ఎవరూ వ్యతిరేకం కాదు
ఏపీలో పరిశ్రమలకు ఎవరూ వ్యతిరేకం కాదని ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. నిజంగా హెచరిస్‌ ఉన్న చోట పార్మా సుటికల్‌ ఫ్యాక్టరీలు పెడుతున్నారు. తునిలో ఇలాంటి పరిశ్రమలు పెడుతుండటంతో ఫార్మా ఫ్యాక్టరీ నుంచి రసాయన నీరు సముద్రంలో కలుషితం అవుతున్నాయి. పరిశ్రమలకు ఎవరు వ్యతిరేకం కాదు. వాటిని ఎక్కడ పెట్టించాలో అక్కడ పెడితే ఉపయోగంగా ఉంటుంది. తునిలో హెచరీస్‌ ఉన్న చోట ఫార్మా ఫ్యాక్టరీలో పెడితే చేపలు బతికే పరిస్థితి లేదు. ఈ రంగం మూతపడే పరిస్థితి నెలకొంది. చేపలు పట్టే వారు వేటకు వెళ్లాలంటే ఇంకా చాలా లోతుకు వెళ్తున్నారు. దీంతో ప్రతి మత్స్యకారుడు తిరిగి ఇంటికి వస్తాడా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇదే వ్యవసాయ రంగం గురించి చంద్రబాబు అన్న మాటలు..స్వామినాథన్‌ కమిటీ సిపార్సులు అమలు చేస్తామని చెప్పారు. కేంద్రంలో టీడీపీ భాగస్వామ ప్రభుత్వం ఉన్న వీళ్లు కనీస మద్దతు ధర గురించి పట్టించుకోవడం లేదు. వరి మద్దతు ధర రూ.50 పెంచారు, మరో రూ.60 పెంచారు. మొత్తంగా పెరిగింది ఎంత అంటే 4 శాతం, పత్తిలో రూ.50, మరో ఏడాది రూ.60, కేవలం 1 శాతం మాత్రమే కనీస ధర పెంచారు. రైతులకు మనం కనీస మద్దతు ధర పెంచింది కనీసం కూడా లేదు. అంటే రైతులకు మద్దతు ధర పెరిగిందా లేదా అని నేను అడుగుతున్నాను. కనీస మద్దతు ధర అన్నది ఏ ముఖ్యమంత్రి అయినా సరే కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి. వైయస్‌ఆర్‌ హయాంలో రూ. 550 నుంచి రూ.1050కి పెరిగింది. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఆ రకంగా పెంచారు. 

బాబు ఇచ్చింది వడ్డీలకే సరిపోవడం లేదు
చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ డబ్బులు రైతుల వడ్డీలకే సరిపోవడం లేదని వైయస్‌ జగన్‌ వివరించారు. రుణమాఫీ వాగ్ధానం విషయానికి వస్తే..రైతుల ఖాతాలోకి వచ్చిన దానికంటే రైతులు కోల్పొయింది ఎక్కువ. 2014–2015కు సంబంధించి రైతులకు ఇచ్చిన రుణాలు రూ.56 వేల కోట్లు ఇవ్వాలని టార్గెటు పెట్టకుంటే రూ.39 వేల కోట్లు మాత్రమే ఇచ్చారు. ఈ ఏడాది రూ.55 వేల కోట్లు మాత్రమే. బాబు సీఎం అయ్యాక రైతులకు రుణాలు ఇవ్వడం లేదు. రైతులకు రుణభారం అధికమైంది. రెండున్నర కాలంలో రూ.1,03,238 కోట్లకు రుణభారం ఎగబాకింది. అపరాధ వడ్డీ 18 శాతం చొప్పున బ్యాంకులకు వడ్డీలు కడుతున్నారు. బాబు ఇచ్చింది కేవలం రూ.10600 కోట్లు మాత్రమే. అంటే ఇచ్చింది వడ్డీలకే సరిపోవడం లేదు. రైతుల టోటల్‌ అకౌంట్స్‌ కూడా కోటి పది లక్షల ఖాతాల్లో ఓవర్‌ డ్యూ అకౌంట్స్‌ 48 లక్షలు , నాన్‌ ఫర్పామెన్‌ అకౌంటోలో అదే పరిస్థితి.  రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి ఎస్‌ఎల్‌బీసీ రిపోర్టే ఆధారం. 

పట్టిసీమ నీళ్లను సముద్రంలో కలుపుతున్నారు
కేవలం కమీషన్ల కోసమే ప్రాజెక్టులకు డబ్బులు ఖర్చు చేస్తున్నారని వైయస్‌ జగన్‌ ఆరోపించారు. ఎటువంటి స్టోరేజ్‌ లేని పట్టుసీమను వేల కోట్లతో నిర్మించారు. దీని నుంచి 54 టీఎంసీలు లిప్ట్‌ చేశామని మంత్రి చెబుతుంటే, ఎస్‌ఈ మాత్రం 48 టీఎంసీలు అంటున్నారు. ఈ ప్రాజెక్టు కరెంటు బిల్లులు చూస్తే 42 టీఎంసీలు లిప్ట్‌ చేసినట్లు అర్థమవుతోంది. ఈ నీళ్లు తీసుకెళ్లి ప్రకాశం బ్యారేజ్‌ వద్ద సముద్రంలో కలుపుతున్నారు. కొత్త అసెంబ్లీలోనైనా సాంప్రదాయం మారుతుందని భావించా. 110 రోజుల్లోనే లిప్ట్‌ చేసిన నీళ్లు సముద్రంలో కలిశాయి. రూ.130 కోట్ల కరెంటు బిల్లులు కట్టారో, ఆ డబ్బులు తెలంగాణ ప్రభుత్వానికి రూ.120 కోట్లు ఇచ్చి ఉంటే పులిచింతలలో 45 టీఎంసీలు స్టోర్‌ చేసుకునే వీలుండేది. ఆ ప్రాజెక్టు నుంచి ప్రకాశం బ్యారేజ్, అక్కడి నుంచి ఏలూరు కాల్వకు నీళ్లు వచ్చేవి. మంత్రి నియోజకవర్గంలోనే పంటలు ఎండిపోతున్నాయి. హంద్రీనీవా విషయంలో ధర్నాలు చేయాల్సి వస్తోంది. వైయస్‌ఆర్‌హయాంలో 80 శాతం పనులు పూర్తి చేశారు. మిగిలిన 20 శాతం పనులు పూర్తి చేయాలని ధర్నాలు చేయాల్సి వస్తోంది. ఫలితంగా అనంతపురం జిల్లాల్లో 63 మండలాలు కరువు మండలాలుగా ప్రకటించారు. నీళ్లు ఇచ్చి ఉంటే ఎందుకు అన్ని మండలాలు కరువు ప్రాంతాలుగా ప్రకటించారు. గాలేరు–నగరి గురించి వీళ్లు మాట్లాడే మాటలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. 2012లోనే అప్పటి కడప కలెక్టర్‌ శశిధర్‌ 3 టీఎంసీల నీళ్లు గండికోటకు నింపారు. ఆ పనులు పూర్తి చేయడం లేదు. 

సేవా రంగంలో వెనకబడ్డాం ..
ఏ దేశంలోగానీ.. ఏ రాష్ట్రంలోనైనా ఇటీవల కాలంలో రాబడిలో అత్యధిక శాతం సేవా రంగం నుంచే వస్తుంది. మొత్తం రెవెన్యూలో దాదాపు సగం సేవా రంగం నుంచి వచ్చేదే. మనకూ గతంలో సేవా రంగంలో 46 శాతం రాబడి ఉండేది. కాగా పరిశ్రముల నుంచి  23 శాతం, వ్యవసాయం నుంచి ఇంచుమించుగా 30శాతం రాబడి వచ్చేది. ఈ సేవారంగంలో ఎక్కువ శాతం ఐటీ రంగం నుంచే వస్తుంది. కానీ మన రాష్ట్రంలో ఐటీ రంగం తీవ్రంగా కుదేలైంది. తెలంగాణకు హైదరాబాద్, మహారాష్ట్రకు ముంబయి, పుణె,.. కర్నాటకకు బెంగళూర్, తమిళనాడుకు చెన్నై ఉండగా మనకు ఐటీ డెస్టినేషన్‌ లేకుండా పోయింది. రాష్ట్రంలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేయాల్సిన చంద్రబాబు అసత్యాలను ప్రసారం చేస్తున్నారు. నిత్యం సత్యనాదెళ్ల పేరు చెప్పి నేనే స్ఫూర్తి.. సత్య నాదెళ్లకు నేనే ట్యూషన్‌ చెప్పా.. అని చెప్పుకునే బాబు ఏపీలో మైక్రోసాఫ్ట్‌ వస్తుందని ఊదరగొట్టాడు. బాబు ప్రకటన ఇచ్చిన కొద్ది గంటల్లోనే సత్య నాదెళ్ల స్థాపించడం లేదని ప్రకటన ఇచ్చారు. బాబు అబద్ధాలకు ఇది చిన్న ఉదాహరణ మాత్రమే. ఈ వార్త ఈనాడులోనే వచ్చింది. ట్రంప్‌ పేరు చెబితే మనోళ్లు ఎలా భయపడుతున్నారో.. చంద్రబాబు పేరు చెబితే కంపెనీలు పెట్టడానికి పారిశ్రామిక వేత్తలు కూడా అలాగే భయపడుతున్నారు. ఎన్‌సీఏఈఆర్‌ (నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ అప్లయిడ్‌ ఎకనమిక్స్‌ అండ్‌ రీసెర్చ్‌ బ్యూరో) రిపోర్టు ప్రకారం దేశంలోనే ఏపీని అవినీతిలో నెంబర్‌ వన్‌ స్థానంలో నిలిపిన ఘనత బాబుదే. మూడేళ్లలో పరిస్థితిని చూస్తే దారుణంగా తయారైంది.  జీడీపీ, వృద్ధి రేటులో తప్పుడు లెక్కలు చూపడం ద్వారా కేంద్రానికి తప్పుడు సంకేతాలు ఇస్తున్నారు. ఇంత భారీగా వ్యవసాయం, పెట్టుబడుల్లో వృద్ధి రేటు సాధించినట్టు చూపిస్తే కేంద్రం మనకు ఎందుకు సాయం చేస్తుంది. ఈ వాస్తవం ముఖ్యమంత్రి గ్రహించాలి. 15 లక్షల కోట్లు ఎంఓయూలు జరుగుతున్నాయని మనమే చెబితే ఇక కేంద్రం మనకు ఎందుకు సాయం చేస్తుంది. జీఎస్‌డీపీ పెరిగితే ఆదాయం పెరగాలిగా.  2004–17 వరకు చూస్తే ప్రపంచంలో ఎక్కడైనా జీఎస్‌డీపీ గ్రోత్‌ రేటు కన్నా రెవెన్యూ గ్రోత్‌ రేటు ఎక్కువ ఉంటుంది. కానీ ఇప్పుడు బాబు హయాంలోనే ఇది రివర్స్‌ ఉంది. 
Back to Top