చంద్రబాబుకు లోకేష్ భయం

తిరుమల : చంద్రబాబు పాలన మూడు మోసాలు, ఆరు అబద్ధాలుగా సాగుతోందని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. తిరుపతిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.... క్యాలెండర్లు మారుతున్నా, చంద్రబాబు మాత్రం మారడం లేదని రోజా ఎద్దేవా చేశారు. యూపీ రాజకీయాలు చూసి ఏపీలో చంద్రబాబుకు బీపీ వచ్చిందని, అక్కడ అఖిలేష్‌లాగానే ఇక్కడ లోకేష్‌ కూడా తనను ఎక్కడ అధికారంలో నుంచి దింపేస్తారనే భయం పట్టుకుందని రోజా వ్యాఖ్యానించారు. ఆ భయంతోనే లోకేష్‌ను మంత్రిని చేయడానికి చంద్రబాబు వెనుకాడుతున్నారన్నారు.  సొంత నియోజకవర్గం కుప్పానికి నీళ్లు లేవన్న చంద్రబాబు... పులివెందులకు ఇస్తామంటే జనం నమ్ముతారా అని ఆమె సూటిగా ప్రశ్నించారు. రాయలసీమకు నిధులు ఇవ్వకుండా, ప్రాజెక్టులు పూర్తి చేయకుండా అన్యాయం చేస్తున్నారని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.

Back to Top