దేశంలో అత్యంత నీచమైన పాలన చంద్రబాబుదే

శ్రీకాకుళంః వైయస్సార్సీపీ జిల్లా స్థాయి ప్లీనరీ సమావేశానికి పార్టీశ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వైయస్సార్సీపీ, వైయస్ జగన్ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ...దేశంలో అత్యంత నీచమైన పాలన చంద్రబాబుదేనని మండిపడ్డారు. బాబు అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో రాష్ట్రాన్ని దివాళా తీయించారని ఫైర్ అయ్యారు. టీడీపీ నేతలు ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి లేదని,  ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై తెలుగుదేశం నేతలను అడుగడుగునా నిలదీస్తున్నారని చెప్పారు.

Back to Top