చంద్రబాబు నీకు ఇది తగునా

తొండూరు : రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి కానుకల పేరుతో మతాలను వేరుచేయడం నీకు తగునా బాబు అని వైయస్‌ఆర్‌సీపీ నాయకులు విమర్శించారు.  తొండూరులో విలేకరుల సమావేశంలో వైయస్‌ఆర్‌సీసీ మండల రైతుసంఘం నాయకులు పల్లెటి ఈశ్వరరెడ్డి, జిల్లా కార్యదర్శి బండి రమణారెడ్డిలు మాట్లాడుతూ చంద్రబాబునాయుడు రంజాన్‌ తోఫాని ముస్లిం సోదరులకు కానుకగా ఇస్తున్నావ్‌.. క్రిస్‌మస్ అని క్రైస్తవులకు కానుకలను ఇస్తున్నావు. అదే సంక్రాంతి పండుగ వస్తే అందరికి కానుకలు ఇస్తున్నావు.. అయితే రంజాన్, క్రిష్‌మస్‌లకు కూడా సంక్రాంతి పండుగ మాదిరే కానుకలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. క్రిష్‌మస్, రంజాన్‌లకు తోఫాలు వేరువేరుగా పంపిణీ చేయడం వల్ల ఇవి కులాల, మతాల మధ్య చిచ్చుపెట్టి మత సామరస్యాన్ని దెబ్బతీసే విధానం కాదా అని వారు ప్రశ్నించారు. అందువల్ల కులమతాల విభేదాలు లేకుండా అందరికి ఒకే మాదిరిగానే సంక్రాంతి, రంజాన్, క్రిష్‌మస్‌లకు కానులకు ఇవ్వాలన్నారు.

Back to Top