చంద్రబాబు దేశంలోనే అత్యంత సంపన్నుడు..అవినీతిపరుడు

– బుర్రకథలను తలపిస్తున్న నవ నిర్మాణ దీక్షలు
– అభివృద్ధి కన్న అవినీతిని పెంచి పోషిస్తున్న చంద్రబాబు

విడవలూరు: రాష్ట్రంలోని చంద్రబాబు మూడేళ్ల పాలన అంతా శూన్యమని, కేవలం కేంద్ర నిధులతోనే అభివృద్ది పనులు జరుగుతున్నాయే తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ అభివృద్ది పనులు చేయడం లేదని వైయస్సార్‌సీపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆరోపించారు. మండల కేంద్రమైన విడవలూరులోని ఆపార్టీ మండల కన్వీనర్‌ బెజవాడ గోవర్ధన్‌రెడ్డి నివాస గృహంలో గురువారం కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నవ నిర్మాణ దీక్షల పేరుతో గత ఎనిమిది రోజులుగా అధికారులను చంద్రబాబు ఇబ్బందులు పెడుతున్నారని గుర్తుచేశారు. ఈ దీక్షలు బుర్రకథలుగా మారాయని ఎద్దేవ చేశారు. రాష్ట్రంలో రైతులు అప్పుల భాదలతో ఆత్మహత్యలు చేసుకుంటుంటే ముఖ్యమంత్రి నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం దారుణమైన విషయమన్నారు. మన రాష్ట్రంలో అభివృద్ది కన్న అవినీతికి చంద్రబాబు పెద్దపీట వేశారని, అవినీతిలో కేంద్రంలోనే రాష్ట్రం మొదటి స్థానంలో ఉందన్నారు. బాబు పేద కులానికి చెందిన వాడిగా ప్రకటించుకోవడం హాస్యాస్పదమన్నారు. ఇటీవల పత్రికల వారితో మాట్లాడుతూ.. ఎవరు కూడ దళితులగా పుట్టాలని కోరుకోరని, మురికి వాడలో పుట్టిన వారికి మురికి బుద్దులే వస్తామని మాట్లాడిన ఆయన నేడు పేద కులమని చెప్పుకుంటుంటే ప్రజలు నవ్వాలో, ఏడవాలో అర్ధంకాక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. భారతదేశంలోనే అత్యంత సంపన్నుడు చంద్రబాబు అని అన్నారు.  ఎన్టీఆర్‌ కుటుంబాన్ని నామరూపాలు లేకుండా చేయాలనే కంకణం కట్టుకుని ఉన్నాడని ఆరోపించారు. ఇందులో భాగంగానే ఎన్టీఆర్‌ కుమారుడు బాలకృష్ణ మంత్రి పదవి ఇస్తే అందరూ ఆయన దగ్గరకు వెళుతారని, చెప్పి ఆయనను పక్కన పెట్టి, తన కుమారుడు లోకేష్‌కు మంత్రి పదవి ఇచ్చాడని గుర్తుచేశారు. మొత్తానికి ఎన్టీఆర్‌ స్ధాపించిన పార్టీని చేతుల్లోకి తీసుకోని ఆయన కుటుంబాన్ని దూరం చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబును ఆంధ్రులకు స్వాప్నికుడుగా ఒక పత్రిక అభివర్ణించడం దారుణమైన విషయమన్నారు. ఈ విషయాలను రాష్ట్ర ప్రజలు గుర్తిస్తున్నారని, త్వరలోనే చంద్రబాబుకు బుద్ది చెబుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైయస్సార్‌సీపి అధికార ప్రతినిధి వీరి చలపతిరావు, కన్వినర్‌ బెజవాడ గోవర్ధన్‌రెడ్డి, నాయకులు మాతూరు శ్రీనివాసులరెడ్డి, అనపల్లి ఉదయ్‌బాస్కర్, బుచ్చంగారి తిరుపతి, నవీన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Back to Top