పుంగనూరు: శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో పాటు బాధ్యులైన అధికారులందరిపై కేసు నమోదు చేయాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ఆయన సోమవారం చిత్తూరులో మాట్లాడుతూ ఎర్రచందనం కూలీల నకిలీ ఎన్‌కౌంటర్ సంఘటనపై సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసి సుప్రీంకోర్టు న్యాయమూర్తి లేదా ప్రత్యేక దర్యాప్తు సంస్ధ ద్వారా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని కోరారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే వైఎస్సార్‌సీపీ తరపున ఆందోళనలు ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.