మ‌హిళ‌ల్ని వేధించ‌టంలో బాబు త‌ర్వాతే..!

మ‌హిళా త‌హ‌శీల్దార్ వ‌న‌జాక్షి కేసు విచార‌ణ‌లోనూ అదే తంతు..!

విజ‌య‌వాడ‌: మ‌హిళా త‌హ‌శీల్దార్ వ‌న‌జాక్షి కేసు విచార‌ణ‌లో చంద్రబాబు, ఆయ‌న తెలుగు త‌మ్ముళ్లు మ‌రోసారి త‌మ బుద్ది బ‌య‌ట పెట్టుకొన్నారు. ప‌చ్చ చొక్కాలు నేరుగా విచార‌ణ అధికారిని బెదిరిస్తున్నారంటే ప‌రిస్థితిని అర్థం చేసుకోవ‌చ్చు.

బుస కొట్టిన తెలుగు దేశం దౌర్జ‌న్యాలు
అడ్డ‌గోలుగా ఇసుక ను త‌రలిస్తున్న తెలుగుదేశం నాయ‌కుల్ని అడ్డుకోవ‌ట‌మే మ‌హిళా  త‌హ‌శీల్దార్ వ‌న‌జాక్షి చేసిన త‌ప్పు. చ‌ట్ట ప్ర‌కారం ప‌ని చేసేందుకు ఆమె ప్ర‌య‌త్నించారు. దీనికి ఆగ్ర‌హించిన తెలుగుదేశం సీనియ‌ర్ ఎమ్మెల్యే, ప్ర‌భుత్వ విప్ చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ నిస్సిగ్గుగా ఆమె మీద దాడి చేయించారు. దీని మీద ఆమె పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ సంగ‌తి తెలుసుకొన్న చంద్రబాబు బ‌హిరంగంగా బుద్దిని బ‌య‌ట పెట్టుకొన్నారు. క్యాంప్ కార్యాల‌యానికి పిలిపించి త‌ప్పంతా ఆమె దే అని తేల్చేశారు. ఇందుకు వీలుగా మంత్రిమండ‌లి లో కూడా ఒక తీర్మానం చేయించారు.

విచార‌ణ‌లోనూ అదే వైఖ‌రి
సీనియ‌ర్ అధికారి శ‌ర్మ తో విచార‌ణ‌కు ప్రభుత్వం ఆదేశించింది. శ‌ర్మ క‌మిటీ ముందు తెలుగుదేశం ఎమ్ఎల్ ఎ చింత‌మ‌నేని మ‌రో సారి రెచ్చిపోయారు. మందీ మార్బలంతో క‌మిటీ ఎదుట హంగామా సృష్టించారు. దీంతో బెదిరిపోవటం శ‌ర్మ వంత‌యింది. ఆఖ‌రికి విచార‌ణ ప్ర‌దేశాన్ని విజ‌య‌వాడ‌కు మార్చారు. ఇదంతా ఒక ఎత్త‌యితే, అస‌లు తాను దాడి చేయ‌లేదని, మ‌హిళా త‌హ‌శీల్దార్ వ‌న‌జాక్షిని తాను ర‌క్షించేందుకు ప్ర‌య‌త్నించాన‌ని చింత‌మ‌నేని ద‌బాయిస్తున్నారు. 
Back to Top