శ్రీకాకుళం: చంద్రబాబు జీవితం అంతా వెన్నుపోటు రాజకీయమే అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం అన్నారు. ఎన్టీఆర్‌పై పోటీ చేస్తానని ప్రగల్భాలు పలికి, మళ్లీ అదే ఎన్టీఆర్ కాళ్లు పట్టుకుని టీడీపీలోకి వచ్చిన చరిత్ర చంద్రబాబుది. ఇక తన రాజకీయ గురువైన అమర్నాథ్‌రెడ్డిని మోసం చేసి, ఆయన కొడుకు కిరణ్ కుమార్ రెడ్డిని పొగడటం ఏమీ రాజకీయం అన్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్‌లో నల్లారి సోదరుల పాత్ర ఉందని ఆరోపించిన చంద్రబాబు ఇప్పుడు వారినే పార్టీలో చేర్చుకున్నారంటే ...ఆయన నీతి ఏపాటిదో అర్థం అవుతోందన్నారు.