చంద్రబాబే మానసిక రోగి

  • ప్రతిపక్షం గొంతు వినాలంటేనే బాబు హడలుతున్నాడు
  • చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన పీడ
  • కుట్రలు,కుతంత్రాలు, వెన్నుపోటు, మోసం, వంచన బాబు నైజం
  • ప్రతిపక్ష నేతపై నిందారోపణలు మానుకోవాలి
  •  బాబు వెన్నులో మరింతగా వణుకు పుట్టిస్తాం
  • వైయస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి
హైదరాబాద్ః ప్రజల వాణి అయిన ప్రతిపక్షం గొంతు వినాలంటేనే చంద్రబాబు గజగజ వణుకుతున్నాడని వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ప్రతిపక్షం అంటేనే  హడలిపోతున్నాడని, చంద్రబాబు వెన్నులో మరింతగా వణుకు పుట్టిస్తామని కరుణాకర్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి నిత్యం జపించే పంచాక్షరి మంత్రం కుట్రలు, కుయుక్తులు, వెన్నుపోటులు, వంచన, మోసం అని చెప్పారు.  ప్రతిపక్ష నేత వైయస్ జగన్ వ్యక్తిత్వం, నాయకత్వం, వ్యవహార శైలిమీద నిరంతరం దాడి చేస్తే తప్ప ఆయనను హననం చేయలేమన్న భయంతో బాబు పార్టీ నేతలతో పాటు అధికారులను కూడ పావులుగా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని విమర్శించారు. హైదరాబాద్ లో పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడారు.  టీడీపీ ఎంపీ బస్సు ప్రమాదానికి గురై అనేక మంది చనిపోతే యాజామాన్యాన్ని శిక్షించాల్సిందిపోయి...మృతుల కుటుంబాలను పరామర్శించడానికి, గాయపడిన వారి పరిస్థితిని అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు నందిగామకు వచ్చిన వైయస్ జగన్ ను ఆడిపోసుకోవడం దారుణమని భూమన చంద్రబాబు సర్కార్ పై మండిపడ్డారు. 

చంద్రబాబు పక్కనే ఉండి కూడ 7 ,8 గంటలు ఐనా ప్రమాద స్థలికి రాలేదని భూమన ఆరోపించారు. వైయస్ జగన్ జరిగిన ప్రమాదాన్ని చూసి చలించి  బాధితుల కుటుంబాలకు అండగా ఉండేందుకు హైదరాబాద్ నుంచి వస్తే బాబు రాజకీయం చేయడం దుర్మార్గమన్నారు.  సంఘటనకు బాధ్యుడైన డ్రైవర్ చనిపోయినప్పుడు పోస్టుమార్టం చేయాల్సిన చట్టబద్ధ వ్యవహారాన్ని పక్కనబెట్టి శవాన్ని తరలించడం అన్యాయమని ప్రశ్నించి వివరణ కోరడం తప్పా..? అని ప్రభుత్వాన్ని నిలదీశారు.  చట్టం అందరికీ సమానంగానే ఉంటుందని, ప్రధాని ఐనా జైలుకు పోవాల్సిందేనని పేర్కొన్నారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ మృతదేహానికి పోస్టుమార్టం జరపాల్సిన బాధ్యత వైద్యులదని అన్నారు. ఎవరైనా తప్పు చేస్తే జైలుకు పోవాల్సిందేనని హెచ్చరిక చేస్తే... అధికారులను జైలుకు పంపిస్తానంటూ బెదిరించాడు, ఆయన మానసిక పరిస్థితి బాగోలేదు అంటూ  ప్రతిపక్ష నేతపై  క్యాబినెట్ లో తీర్మానం చేయడం బాబు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. అసలు మానసిక రోగి చంద్రబాబు మాత్రమేనని, ఆయన రాష్ట్రానికి పట్టిన పీడ అని భూమన నిప్పులు చెరిగారు. 

నిజాన్ని బయటకు వెలికితీయడం, అన్యాయాన్ని ఎత్తిచూపడం ప్రతిపక్ష నాయకుడి బాధ్యత అని భూమన స్పష్టం చేశారు. దానికి కూడ అవకాశం ఇవ్వకుండా  అధికారులను తిట్టాడంటూ ఐఏఎస్ అధికారులతో తీర్మానం, పోలీసు అధికారులతో ఖండన చేయించడం దుర్మార్గమన్నారు. తప్పుడు పనులు చేసే వాళ్లను వెనకేసుకురావడాన్ని మీరు సమర్థిస్తారా...? ప్రభుత్వాలు వస్తాయి పోతాయి. మీరు ఎవ్వరికీ బాకాలు ఊదాల్సిన పనిలేదని అధికారులకు సూచించారు. చట్టబద్ధతో నడిచే పార్టీ ఆశయాల ప్రకారం నడవాలి గానీ వారి లోపాయికారి పనులను సమర్థించేందుకు కాదు మీరు ఉద్యోగాలు చేయాల్సిందని అధికారులకు హితబోధ చేశారు. ప్రపంచబ్యాంకు తొత్తు అయిన చంద్రబాబు తాను ఆమర్త్యసేన్ కంటే గొప్ప ఆర్థికవేత్తనంటూ గతంలో పుస్తకం రాయించుకొని ప్రచారం చేసుకొన్న విషయాన్ని గుర్తుచేశారు.  విద్యుత్ రంగంలో 60శాతం మంది.....రెవెన్యూలో 64 శాతం మంది, పోలీసు శాఖలో 62 శాతంమంది అధికారులు అవినీతి పరులే...! ఉద్యోగస్తులకు జీతాలు దండగ... నాలుగో పే కమిషన్ అనవరసంగా జీతాలు పెంచింది... వాళ్ల వల్లే రాష్ట్రం నష్టాల్లోకి నెట్టబడింది.. లక్షన్నర ఉద్యోగాలను తీసేయాలని ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాబు రాసిన మనసులో మాటను బయటపెట్టారు.  పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు అధికారులను బండ బూతుల కంటే హీనంగా మాట్లాడారని గుర్తు చేశారు. 

బాబు గతంలో అధికారుల గురించి ఎంత నీచంగా మాట్లాడాడో ప్రజలు ఇంకా మరచిపోలేదని భూమన చెప్పారు.  బాబ్లీ ప్రాజెక్ట్ కట్టిన సమయంలో పోలీసులపై,  ఏపీ భవన్ లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల మీద... మీ అంతుచూస్తా, మీ తాటతీస్తానన్నప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఉందా బాబు...? చంద్రబాబు రెచ్చిపోయి మాట్లాడితే వేద ఆశీర్వచనాలట. అదే వేరొకరు తప్పు చేస్తే శిక్షార్హులవుతారని అంటే బూతట. ఏ తప్పుడు పదజాలం మాట్లాడని జగన్ మీద క్యాబినెట్ లో తీర్మానం చేసి అధికారులతో నిందారోపణలు మోయించడం సరికాదని బాబుకు హితవు పలికారు. ప్రమాదం జరిగిన సంఘటనకు ప్రభుత్వం కనీసం సంతాపం కూడా తెలపలేదని, నష్టపరిహారం చెల్లించలేదని భూమన దుయ్యబట్టారు. బొట్టుకు, కానికి ఉపయోగపడని మంత్రులంతా ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతున్న వైయస్ జగన్ పై బురదజల్లితే భయపడేందుకు మేం సిద్ధంగా లేమని భూమన హెచ్చరించారు.

 జగన్ పేరులో గన్ ఉంది కాబట్టి టెర్రరిస్టు అని కూడా అనే పరిస్థితికి చంద్రబాబు అండ్ కో తయారైందని భూమన ఎద్దేవా చేశారు. ఈ మూడేళ్లలో చంద్రబాబుకు తన పాలన మీద తనకే నమ్మకం లేదని భూమన చెప్పారు. అందుకే ప్రతి చిన్న విషయానికి బెంబేలెత్తిపోతున్నారని ఆరోపించారు.  రెండేళ్లలో అసెంబ్లీని కట్టేశాను, ప్రపంచంలోకెళ్లా అద్భుతంగా తీర్చిదిద్దుతానని బాబు మాట్లాడడం శోచనీయమన్నారు. శాసనసభలో ప్రతిపక్షాల గొంతు నొక్కకుండా ప్రజాస్వామ్యబద్ధంగా అవకాశం కల్పిస్తే అప్పుడు సభకు వన్నెవస్తుంది గానీ బెంచీలు, కుర్చీలున్నంత మాత్రాన ప్రయోజనం లేదన్న సంగతి తెలుసుకోవాలని బాబుకు చురక అంటించారు. ప్రభుత్వాన్ని నిలదీసే ప్రతిపక్షం యొక్క  ప్రజల గొంతును శాసనసభలో మైకుల ద్వారా వినిపించేందుకు సహకరించాలన్నారు.  ప్రతిపక్షం గొంతు వినిపించినప్పుడే ప్రజా వాణి వినిపిస్తుందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా వినిపిస్తారన్న నమ్మకం సమాజం పట్ల బాధ్యత కలిగిన వారికి లేకుండా చేశారని బాబు పాలనను తూర్పారబట్టారు.  మీ అప్రజాస్వామిక విధానాలతో మాలిన్యాన్ని అంటే కార్యక్రమం మానకపోతే నిరంతరం ఉద్యమాలు చేస్తూనే ఉంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వైయస్ జగన్ నేతృత్వంలో ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడుతామన్నారు. 
Back to Top