చంద్రబాబు దీక్ష డ్రామా డాట్‌ కమ్‌

విజయవాడ: చంద్రబాబు చేస్తున్నది నవ నిర్మాణ దీక్ష కాదని, డ్రామా డాట్‌ కమ్‌ అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి, విజయవాడ నగర అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాస్‌  అభివర్ణించారు. రాష్ట్రంలో అవినీతి, అరాచకాలు, హత్యా రాజకీయాలు రాజ్యమేలుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇవాళ విజయవాడలోని పార్టీ కార్యాలయంలో వెల్లంపల్లి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు మూడేళ్ల పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, టీడీపీ నేతలు దారుణంగా దోచుకుని తింటున్నారని ఆరోపించారు. మిత్రపక్షమైన బీజేపీ కూడా టీడీపీ పాలనను తప్పుపడుతోందని గుర్తు చేశారు. చంద్రబాబుకు పొద్దున లేచింది మొదలు పడుకునే వరకు వైయస్‌ జగన్‌ జపం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. నవ నిర్మాణ దీక్ష పేరుతో ప్రతిజ్ఞలు చేస్తునే చంద్రబాబు తప్పులు చేస్తున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అవినీతి, పార్టీ ఫిరాయింపులు, రైతుల భూములు లాక్కోవడంలోనూ, అరాచకాల్లో నంబర్‌ వన్‌ స్టేట్‌గా చేశారని మండిపడ్డారు.

Back to Top