చంద్రబాబు రాజకీయ అఘోరా

సిగ్గుశరం ఉన్నాయా బాబు నీకు
ఎన్ని గొంతులు నొక్కుతావు
ఓటుకు కోట్లుకు భయపడి పారిపోయావు
ఏపీ ప్రయోజనాలను తాకట్టు పెట్టావు
ఎన్టీఆర్ పై చెప్పులు వేయించిన నీచుడు బాబు
చంద్రబాబుపై ధ్వజమెత్తిన వైయస్సార్సీపీ నేతలు

విజయవాడః చంద్రబాబు సాక్షి టీవీ చానల్ గొంతు నొక్కుతున్నారని, ఇలా ఎన్ని గొంతులు నొక్కుతారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు. అందుకే పార్టీ కార్యకర్తలు, అభిమానులు అందరూ సోషల్ మీడియాను బ్రహ్మాస్త్రంగా మార్చుకోవాలని ఆయన సూచించారు. సోషల్ మీడియా గొంతును చంద్రబాబు కాదు కదా.. ఆయన తండ్రి కూడా నొక్కలేరని తెలిపారు. పార్టీలు మారేవాళ్లను రాజకీయ వ్యభిచారులు, రాజకీయ దొంగలు అని చంద్రబాబే అనేవారని, అలాంటివాళ్లకి కండువాలు కప్పుతున్న బాబు రాజకీయ అఘోరా అని ఆయన మండిపడ్డారు. తాను హజారే కొడుకునని, కేజ్రీవాల్ బావమరిదినని చెప్పుకొనే చంద్రబాబు.. దేనికైనా సై అంటారు గానీ రెండింటికి మాత్రం నై అంటారన్నారు. 

రాజధాని భూదందాపై , ఏపీలో జరిగిన ఎమ్మెల్యేల కొనుగోళ్లపై సీబీఐ విచారణకు మాత్రం ఆయన ఒప్పుకోరన్నారు. 10 మంది ఎమ్మెల్యేలను తెచ్చుకున్నంత మాత్రాన 2019లో ఫలితం మారదని స్పష్టం చేశారు. 2014 ఎన్నికలకు ముందు, ఫలితాలు రావడానికి ముందు చంద్రబాబు గెలుస్తారని ఆయనతో పాటు ఆయన వెంట ఉన్న నాయకులు కూడా ఎవరూ అనుకోలేదని.. అందుకే ఆ పార్టీలో ఉన్న చాలామంది వైయస్ఆర్‌సీపీలో చేరుతామంటూ వచ్చేవారని, కానీ అప్పటికే నియోకజకవర్గాలలో టికెట్లను ఖరారు చేసినందున.. విలువలకు కట్టుబడిన వైయస్ జగన్ మోహన్ రెడ్డి వారి రాకను నిరాకరించారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు. అప్పట్లో టికెట్ ఇస్తామని చెబితే చాలు.. పార్టీలోకి వచ్చేస్తామంటూ రాయబారాలు, బేరాలు నడిపిన చాలామంది నాయకులు ఇప్పుడు చంద్రబాబు కేబినెట్‌లో మంత్రులుగా ఉన్నారని ఆయన తెలిపారు.

అప్పట్లో టీడీపీ తరఫున పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా దొరక్క రా బాబూ..రా బాబూ అంటూ కనపడినవాళ్లకు అందరికీ కండువాలు కప్పారని ఎద్దేవా చేశారు. మోదీ , పవన్ కల్యాణ్ ల వల్ల, తమ నాయకుడికి అబద్ధాలు చెప్పడం చేతకాకపోవడం వల్లే బాబు గెలిచాడని గుర్తుచేశారు. తలకిందులుగా తపస్సు చేసినా 2019లో నిన్ను, నీ కుమారుడిని ఎవరూ కాపాడలేరని స్పష్టం చేశారు. 2019లో తుపాను కాదు.. వైయస్ జగన్ మోహన్ రెడ్డి అనే సునామీ రాబోతోందని చెప్పారు. రాష్ట్రంలో ఉండే కోట్లాది మంది గొంతుక.. వైయస్ జగన్ మోహన్ రెడ్డి అని తెలిపారు. ఇద్దరు మోసగాళ్లు, ఇద్దరు నియంతలు ఈ తెలుగు రాష్ట్రాలను పాలిస్తున్నారని, వాళ్లిద్దరినీ అడ్డుకోకపోతే ప్రజలను కాపాడే అవకాశం లేదని చెప్పారు. రేపటి రోజు సూర్యుడు తూర్పున ఉదయిస్తాడన్నది ఎంత సత్యమో.. 2019లో వైయస్ జగన్ సీఎం కావడం అంతే సత్యమని అన్నారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు మరింత దుర్మార్గంగా వ్యవహరించే అవకాశం ఉందని, కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త సోషల్ మీడియాను బ్రహ్మాస్త్రంగా చేసుకుని, దాన్ని జీవితంలో, రాజకీయ పోరాటంలో ఒక భాగం చేసుకోవాలని తెలిపారు.

మేం తలచుకుంటే ఏ చానల్ రాదు
ఎమ్మెల్యే కొడాలి నాని
చంద్రబాబు  మీడియాను భయపెట్టి సొంత డబ్బా కొట్టించుకుంటున్నారని వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని విమర్శించారు. విజయవాడలో పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు. చంద్రబాబు అవినీతి, ఆయన చిల్లర రాజకీయాల గురించి చూపిస్తారనే సాక్షి టీవీ ప్రసారాలను ఆపేశారని కొడాలి నాని ఆరోపించారు. రాష్ట్రం ఏమైనా మీ జాగీరా? మీ బావమరిది, మీ తమ్ముడి కొడుకు సినిమాలనే టీవీలో చూడాలా? మాకు నచ్చిన చానెల్ను చూడనివ్వరా? అంటూ చంద్రబాబును నిలదీశారు. సాక్షి టీవీ ప్రసారాలను పునరుద్ధరించకుంటే తీవ్ర పరిణామాలుంటాయన్నారు. తాము తలచుకుంటే రాష్ట్రంలో ఏ చానెల్ కూడా రాదని హెచ్చరించారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా వార్తలను ప్రసారం చేసే చానళ్లను అడ్డుకోవడం దారుణమని కొడాలి నాని ఫైర్ అయ్యారు. 

పేదలకోసం ఎన్టీఆర్ టీడీపీని స్థాపిస్తే, ఆయన బతికుండగానే చంద్రబాబు మెడపట్టి గెంటేసి పదవి లాక్కున్నారని కొడాలి నాని విమర్శించారు. ఎన్టీఆర్ చావుకు కారకులైన సన్నాసులు టీడీపీలో ఉంటే, వైయస్ కుటుంబం కోసం పదవులు త్యాగం చేసిన నేతలు వైయస్ఆర్ సీపీలో ఉన్నారని అన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట కోసం సోనియాను ఎదిరించి వైయస్ జగన్ జైలుకెళితే, ఓటుకు కోట్లు కేసుకు భయపడి చంద్రబాబు విజయవాడకు పారిపోయి వచ్చారని ఎద్దేవా చేశారు.

రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు
ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి
చంద్రబాబు నాయుడు వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేశారని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు.  విజయవాడలో పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో వై.విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ... రూ. 87 వేల కోట్ల రైతు రుణాలను బేషరతుగా మాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు ఇప్పటి వరకు రూ. 7 వేల కోట్లు కూడా విడుదల చేయలేదని విమర్శించారు. నీటిపారుదల విషయంలోనూ రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్ట్లు నిర్మిస్తున్నా చంద్రబాబు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే  రాష్ట్రం ఎడారిగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఓటుకు కోట్లు భయంతోనే రాష్ట్ర ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టు పెట్టారని విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు.

సిగ్గు, శరం ఉన్నాయా చంద్రబాబు
విజయవాడ నగర అధ్యక్షుడు వంగవీటి రాధా
తన తండ్రి వంగవీటి మోహన రంగా, దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డిల ఫొటోలతో కట్టించిన బ్యానర్లను తీసేసిన నువ్వొక  నాయకుడివి, ముఖ్యమంత్రివా.. సిగ్గు, శరం ఉన్నాయా అంటూ విజయవాడ నగర అధ్యక్షుడు వంగవీటి రాధా మండిపడ్డారు.  విజయవాడలో  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. బతికినంత కాలం, రాజకీయాల్లో ఉన్నంత కాలం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే కొనసాగుతామన్నారు. ముఖ్యమంత్రి ఎంత బెదిరించినా లొంగేది దన్నారు. విజయవాడ నగరంలో ముఖ్యమంత్రి ఉండటం వల్ల సామాన్య ప్రజలకు ట్రాఫిక్ సమస్య తప్ప వేరే ప్రయోజనం ఏమీ లేదని ఆయన ఎద్దేవా చేశారు. డివైడర్లు పగలగొడతారు, మళ్లీ కట్టిస్తారని.. ఏ పని ఎందుకు చేస్తున్నారో తెలియదని అన్నారు.

తన తండ్రిని చంపించినవాళ్లతో బాబు బ్యానర్లు కట్టించుకుంటున్నారని రాధా ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు రోజులు ఆగితే విజయవాడలో వైయస్ఆర్‌సీపీ జెండా ఎగురుతూ ఉంటుందని, తాము దేనికైనా సిద్ధంగా ఉన్నామని.. దమ్ముంటే రావాలని సవాలు చేశారు. వైయస్ జగన్ సీఎం అయ్యాక ఎవరికీ ఇబ్బంది అన్నది లేకుండా చూస్తామని చెప్పారు. ఒకవైపు కాపుల సమస్యలపై ముద్రగడ పద్మనాభం నిరవధిక నిరాహార దీక్ష చేస్తుంటే, పనికిమాలిన వాళ్లతో స్టేట్‌మెంట్లు ఇప్పిస్తున్నారని విమర్శించారు. సాక్షి టీవీ చానల్ ఆపారు గానీ సోషల్ మీడియాను ఆపగలరా, ఎదురుతిరిగితే మీ పరిస్థితి ఏంటని వంగవీటి రాధాకృష్ణ ప్రశ్నించారు. తమది నిజంగా ప్రజల కోసం పోరాడే పార్టీ కాబట్టి తమ పోరాటానికి ప్రజల మద్దతు ఉంటుందని ఆయన అన్నారు.

చంద్రబాబు నీతులు మాట్లాడడం హాస్యాస్పదం
వైయస్సార్సీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి
టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్పై చెప్పులేయించిన నీచుడు చంద్రబాబు నాయుడని వైయస్సార్సీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి విమర్శించారు. వైయస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి గురించి చంద్రబాబు మాట్లాడటం సిగ్గుచేటని మండిపడ్డారు. విజయవాడలో  పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆమె ప్రసంగించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ఆర్ కాళ్లు పట్టుకుని కేసు మాఫీ చేయించుకున్న చంద్రబాబు ఇప్పుడు నీతులు మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. 

Back to Top