చంద్రబాబు రాజకీయ మాంసాహారి

  • బాబు  నిత్య శాఖాహారే కానీ...
  • ఇసుక,మట్టి, వేలకోట్లు తినే రాజకీయ మాంసాహారి
  • రాజమౌళితో రాజధాని కట్టిస్తాననే స్థాయికి దిగజారాడు
  •  లోకేష్ ను హీరోగా పెట్టి సినిమా తీయించుకోపోయావా
  • ఊహాచిత్రాలు వేరు..రాజధాని వేరని తెలుసుకో 
  • దేవుడి భూములను కాజేయాలని చూసి ఇంకా బుకాయిస్తావా
  • ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి
  • వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు
హైదరాబాద్ః దేవుడి భూములను కాజేయాలని చూసి ఇంకా సిగ్గులేకుండా చంద్రబాబు బుకాయించే ప్రయత్నం చేస్తున్నారని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. సదావర్తి భూములను  టీడీపీ నేతలు లోకేష్ నేతృత్వంలో దోచుకోవాలని చూశారని అంబటి అన్నారు. మద్రాసులోని దేవాదయ భూములకు ధర్మకర్తగా ఉండి కాపాడాల్సిన ప్రభుత్వం...టీడీపీ ఎమ్మెల్యేతో లెటర్ రాయించి ఆక్షన్ పెట్టించే కార్యక్రమం చేయించి ఆ భూములు కాజేయాలని పథకం ప్రకారం కుట్ర పన్నిందన్నారు. చంద్రబాబు అక్రమంగా వేలం వేయించి  సంజీవరెడ్డి అనే వ్యక్తికి అప్పనంగా భూములు కట్టబెట్టడం వల్లే ఆర్కే న్యాయస్థానాన్ని ఆశ్రయించారని గుర్తు చేశారు.  బాబు, లోకేష్ బినామీలు అన్యాయంగా వేలం పాడుకున్నారని కోర్టుకు వెళితే....అందుకు 5 రెట్లు ఎక్కువ వెచ్చించి న్యాయస్థానం ఆదేశం ప్రకారం ఆర్కే ఆ భూములను తీసుకున్నారన్నారు.  హైదరాబాద్ లో పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అంబటి మాట్లాడారు. 

అంతటితో ఆగకుండా ఆక్షన్ జరగడానికి వీల్లేదని బాబు మనుషులు సుప్రీంకోర్టుకు వెళితే చివాట్లు పెట్టి మళ్లీ ఆక్షన్ జరిపించిందన్నారు. బాబు రూ.22కోట్లకు కాజేయాలనుకున్న భూమి పబ్లిక్ వేలంలో 60.30కోట్లు ధర పలికిందన్నారు. అంటే, మూడింతల ధరకు వేలంలో పాడుకున్నారని గుర్తు చేశారు. ఆలయ భూములను కాజేయాలన్నదుర్బుద్ధితో మీరు ఉంటే ప్రతిపక్షానికి ఏం సంబంధమని చంద్రబాబును నిలదీశారు. దేవాదయ భూములను బోంచేసేందుకు బాబు ప్రయత్నించారని స్పష్టంగా అర్థమవుతోందన్నారు. ఇందుకు ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలన్నారు.  ఏపీ  ఉన్నంతవరకు నీనే శాశ్వతమని బాబు అహంకారంతో మాట్లాడుతున్నారని అంబటి ఫైర్ అయ్యారు. సదావర్తి భూముల అక్రమాలను పక్క దారి పట్టించేందుకే బాబు ప్రతిపక్ష నేతను ఆడిపోసుకుంటున్నారని అంబటి అన్నారు. 

చంద్రబాబు కోడిగుడ్డు, కూరగాయలు తినే నిత్య శాఖాహారే కానీ..ఇసుక, మట్టిని, వేలాది కోట్లు తినే రాజకీయ మాంసాహారి అని అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.  మూడున్నరేళ్లలో చంద్రబాబు  4లక్షల కోట్లు మింగేశాడని విమర్శించారు. చంద్రబాబు శాఖాహారిగా ఆయన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మాంసాహారిగా రాష్ట్ర ఆరోగ్యాన్ని భక్షిస్తున్నాడని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు చేసేది మరొకటని చురక అంటించారు. మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె అన్నట్టు బాబు తీరు ఉందని అంబటి విమర్శించారు. రాజధానికి డిజైన్లు కోసం సింగపూర్, జపాన్, లండన్ నార్మన్ పోస్టర్ అంటూ కాలయాపన చేస్తున్నాడని మండిపడ్డారు. ఇప్పుడు రాజమౌళితో డిజైన్లు చేయిస్తానని మాట్లాడుతున్నారని...అసలు బాబు మానసిక పరిస్థితి బాగుందా అని అనుమానం వ్యక్తం చేశారు. మీ అబ్బాయి లోకేష్  , మీ బావమరిది బాలకృష్ణ హీరోగా రాజమౌళితో  సినిమా తీయించుకో అభ్యంతరం లేదు గానీ...సినిమాలో మంచి బొమ్మలు వేశారని  ఆయనతో రాజధాని డిజైన్లు చేయిస్తామనడమేంటని అంబటి మండిపడ్డారు. రాజమౌళి మంచి డైరెక్టరే కానీ.... ఊహాచిత్రాలు వేరు రాజధానిలు వేరని అంబటి అన్నారు. రామౌళితో రాజధాని కట్టిస్తాననే స్థాయికి దిగజారిపోయాడంటే బాబును ఏమనాలో అర్థం కావడం లేదన్నారు. 

Back to Top