ఆంధ్ర తగలబడుతుంటే ఫిడేల్ వాయిస్తున్నాడు

కర్నూలుః  మూడు రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తున్నాం. తెలంగాణ ప్ర‌భుత్వానికి మ‌న గోడును చెప్పుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాం... క‌నీసం మ‌న గోడు ఇప్ప‌టికైనా అర్థ‌మ‌వుతుందేమో... విన‌బ‌డుతుందేమో... ఇలానైనా వారి మ‌న‌స్సు క‌రుగుతుంద‌ని జ‌ల‌దీక్ష‌ను చేస్తున్నామ‌ని ఏపీ ప్రతిపక్ష నేత వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయ‌స్ జ‌గ‌న్ అన్నారు. దీక్షాస్థలి నుంచి వైయస్ జగన్ మాట్లాడుతూ... అయ్యా కేసీఆర్ మొన్న‌టి వ‌ర‌కు అంద‌రం క‌లసి గ‌ట్టుగా ఉన్నాం. ఒకే రాష్ట్రంగా  ఉన్న‌ప్పుడు ఆనాడు  బాబ్రీ , ఆల్‌మ‌ట్టి, ఇత‌ర ప్రాజెక్టులను వ్యతిరేకించ లేదా అని ప్రశ్నించారు. ఎలాంటి అనుమతులు లేకుండా మీరు ఇష్టానుసారం ప్రాజెక్ట్ లు కట్టుకుంటూ పోవడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. అడగాల్సిన స్థితిలో ఉండి కూడా బాబు నోరుమెదకపోవడం దారుణమన్నారు. సమస్యలతో ఆంధ్ర తగలబడుతుంటే బాబు ఫిడేల్ వాయిస్తున్నాడని జననేత మండిపడ్డారు.

Back to Top