చంద్రబాబు నాయుడు పాపాలు చేయటం చాలా కామన్. అవి జనానికి శాపంగా మారటం అంతే కామన్. కానీ మరీ ఇంత మందికా అని మీకు అనుమానం కలగ వచ్చు. ఇది నూటికి నూరుపాళ్లు నిజం.రాజధాని ప్రాంతంలో చంద్రబాబు 33వేల ఎకరాల భూమిని రైతుల నుంచి లాక్కొన్నారు. ఆయనేమో రైతులు స్వచ్చందంగా ఇచ్చారు అని దబాయించ వచ్చు గాక కానీ, వాస్తవం మాత్రం బెదిరించి లాక్కోవటమే. ఇప్పుడు ఆ 33వేల ఎకరాల్లోనూ పంటల్ని నిలిపివేయించి రియల్ ఎస్టేట్ పనులు చేపట్టారు. సింగపూర్ కంపెనీలకు దాన్ని దోచిపెట్టేందుకు రంగం సిద్దం చేస్తున్నారు.అమరావతి ప్రాంతంలో ఒక ఎకరా తక్కువలో తక్కువ 40 బస్తాల ధాన్యం పండుతుంది. అదీ ఒక సీజన్ లో. మనం ఒక్క సీజన్ గురించే మాట్లాడుకొందాం. అంటే 33 వేల ఎకరాల్లో 33,000 X 40 =13,20,000. అంటే 13 లక్షల 20వేల బస్తాల ధాన్యం పండుతుంది. దీన్ని బియ్యంగా మారిస్తే 75 కిలోల చొప్పున 13,20,000×75=99,000,000 కిలోల బియ్యం అన్నమాట. ఒక కిలో బియ్యం ముగ్గురికి వేసుకొన్నా కూడా 99,000,000 ×3 =19,80,00,000 అవుతుంది. అంటే 19 కోట్ల 80 లక్షల మందికి తిండి దక్కేది అన్నమాట.చంద్రబాబు నాయుడు బలవంతంగా 33వేల ఎకరాల్లో పంటల్ని ఆపేసి ఈ దేశంలో 19 కోట్ల 80 లక్షల మందికి తిండి లేకుండా చేస్తున్నారు. ఇది ఒకసారి ముచ్చట కాదు. మూడు సీజన్ లలోనూ పంట లేకుండా చేసి ఇంతమందికి తిండి లేకుండా చేయటం చంద్రబాబుకే సాధ్యం.