టీడీపీ పాలనలో అభివృద్ధి శూన్యం..

విజయనగరంః చంద్రబాబు పాలనపై మహిళలు ధ్వజమెత్తారు.  వైయస్‌ జగన్‌ను కలిసి తమ సమస్యలను మొరపెట్టుకున్నారు. కోట నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందని మహిళలు అన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే లలిత కుటుంబం సుదీర్ఘకాలం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా అభివృద్ధి జరగలేదన్నారు. గ్రామాల్లో తాగునీరు ఒక రోజు వస్తే మూడురోజులు రాని పరిస్థితి అని  ఆవేదనవ్యక్తం చేశారు. తమకు కనీసం విద్యుత్‌ సౌకర్యం కల్పించలేకపోయారన్నారు. అర్హత ఉన్నా పింఛన్లు ఇవ్వడంలేదని జామి గ్రామ మహిళలు వాపోయారు. వైయస్‌ఆర్‌సీపీకి మద్దతు ఇవ్వడంతో పింఛన్లు తొలగించారన్నారు. ఇళ్లు, డ్వాక్రా రుణాలు మంజూరు కాలేదన్నారు. వైయస్‌ఆర్‌సీసీ అధికారంలోకి వచ్చాక అందరికి న్యాయం చేస్తామని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు.
Back to Top