సొంత ఇమేజ్ కోసం ప్రధానికి చెక్..!

శంకుస్థాపనకు ప్రధాని నరేంద్రమోడీని ఆహ్వానించిన చంద్రబాబు ..అందుకు సంబంధించిన కార్యక్రమాల్లో మాత్రం తన మిత్ర పక్షానికి చెక్ పెట్టే ప్రయత్నాలు చేస్తున్నాడు. భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం పంపణీ చేసే జ్యూట్ బ్యాగులపై చంద్రబాబు తన సొంత ఇమేజ్ కోసం పాకులాడుతున్నాడు. ప్రధానిని పక్కనబెట్టేసి  తన ఫోటోలతో బ్యాగును కప్పేస్తున్నాడు. 

రాజధాని ప్రాంతంలోని రైతులకు ఓ ధోవతి, చీర, కండువా, జాకెట్ ను జ్యూట్ బ్యాగుల్లో పెట్టి పంచుతున్నారు. ఐతే వాటిపై ఒకవైపు, చంద్రబాబు..ఇంకోవైపు మోడీ ఫోటోలు ముద్రించాలని కాంట్రాక్టర్ కు ఓ టీడీపీ నేత సలహా ఇచ్చాడు. ఐతే ఆకాంట్రాక్టర్ చంద్రబాబు దగ్గరికెళ్లి చూపించగా...ప్రధాని ఫోటో పెట్టొద్దంటూ కాంట్రాక్టర్ కు తెగేసి చెప్పాడు. బ్యాగులపై ముద్రించిన ఫోటోలు తీసేయాలని హుకూం జారీ చేశాడు. 
Back to Top