చంద్రబాబు గప్పాలు

హైదరాబాద్ః  దివంగత నేత వైయస్ఆర్ చేసిన పనుల్ని తానే చేసినట్లు గప్పాలు కొట్టుకునేందుకు చంద్రబాబు సభలు, సమావేశాలు జరుపుతుండడం సిగ్గుచేటని వైయస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ప్రజలను పొగడ్తల బిక్ష అడుక్కునే బిక్షగాడిగా బాబు తయారయ్యాడని విమర్శించారు.  వైయస్ రాజశేఖరరెడ్డి చేసిన అభివృద్ధిని చూసి ఆయన పాలన సువర్ణయుగమని ప్రతీ తెలుగువాడు భావిస్తున్నారని తెలిపారు. అందుకే మహానేతను జనం గుండెల్లో పెట్టుకున్నారని భూమన స్పష్టం చేశారు.

Back to Top