ప్రత్యేక హోదా కు చంద్రబాబే అడ్డంకి..!


() పోరాటాన్ని నీరు కార్చే ప్రయత్నం

()   తప్పుదారి పట్టిస్తున్న ప్రభుత్వం

() అసెంబ్లీలో నిలదీసిన వైఎస్ జగన్

 

హైదరాబాద్) స్పెషల్ సమ్మిట్ పేరుతో చంద్రబాబు చేసిన గిమ్మిక్కుల్ని ప్రతిపక్ష
నేత వైఎస్ జగన్ బయట పెట్టారు. సొంత ఇమేజ్ పెంచుకొనేందుకు చేస్తున్న ప్రయత్నాలతో
ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు భంగం కలుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో
ఆయన ఏం చెప్పారో ఆయన మాటల్లోనే..!

          ‘‘ ప్రతి విషయంలోనూ అధికార పక్షం అడ్డుతగిలే
తీరును ప్రజలు గమనిస్తున్నారు. వినడానికి కూడా ఓపిక లేదు. ఎవరిది తప్పన్నది ప్రజలు
గుర్తిస్తున్నారు. ప్రజల సమస్యలు ముఖ్యం. బాబు సిన్సియారిటిని ఎందుకు డౌట్
చేయాల్సి వస్తోంది అంటే. ఆయన ప్రవర్తన చూస్తే బాధేస్తోంది.

రాష్ట్రంలో విశాఖపట్నంలో టుడే ఇన్వెస్టార్ మీట్ కు జైట్లీ సహా అరడజను మంది
కేంద్రమంత్రులను పిలిచారు. పెద్ద పబ్లిసిటీ కూడా చేశారు. వారందరి సమక్షంలో రెండు
రోజుల్లో 4.67 లక్షల కోట్ల
పెట్టుబడులు తెచ్చామని డంబాలు , గొప్పలు పలికారు. మోడీకన్నా కష్టపడ్డా. దేశాలు తిరిగా. సింగపూర్, దావోస్ వెళ్లి నా కరిష్మా మీద ఈ పెట్టుబడులు
వచ్చాయని బాబు డంబాలు పలికాడు. బాబు మీరు అలా చేస్తే వాళ్లందరూ ఏమనుకొంటారు. కేంద్రమంత్రులకు ఎలాంటి పిక్చర్
ఇచ్చారు. 4.67
లక్షల కోట్లు  పెట్టుబడులు తెచ్చాడు. ప్రత్యేకహోదా ఇవ్వకపోయినా
పర్వాలేదని కేంద్రమంత్రులు అనుకోరా అధ్యక్షా. 1994 నుంచి  2004 దాకా బాబు ముఖ్యమంత్రి గా తొమ్మిదేళ్లు చేశాడు.
ఈమాదిరిగానే అప్పుడు కూడా విదేశాలలో షికార్లు కొట్టేవాళ్లు. ఇన్వెస్టార్ మీటింగ్
లతోనే తొమ్మిదేళ్లు పరిపాలించారు.

ఆయన పరిపాలనలో వేయి కోట్ల పైబడి పెట్టుబడులతో ఎన్ని గ్రీన్ ఫీల్డ్ పరిశ్రమలు
తీసుకొచ్చారు. ఎన్నివేల కోట్ల పెట్టుబడులు తెచ్చారు, ఎన్నివేల మందికి ఉద్యోగాలు ఇచ్చారు అని
అడుగడుతున్నా.  చంద్రబాబు ఈమధ్యకాలంలో
వైట్ పేపర్ ఇచ్చాడు. తొమ్మిదేళ్ల గురించి చెబితే  ఇంకా అన్యాయపరమైనవి
వస్తాయి. 2004
దాకా చంద్రబాబు ఐదేళ్ల పాలనలో వ్యవసాయంలో 2.8 శాతం పెరుగుదల . పారిశ్రామిక రంగాల్లో 5.20 గ్రోత్ రేట్, సేవారంగాల్లో 7.7 శాతం ఉంది. అదికూడా వారి వైట్ పేపర్ ప్రకారం. మొత్తంగా రాష్ట్రానికి సంబంధించిన జీఎస్ డీపీ
గ్రోత్ రేట్ 5.81
శాతం. 2004 నుంచి 2009 దాకా పరిపాలన చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ..చంద్రబాబు మాదిరి దావోస్ పోలేదు. గొప్పలు చెప్పలేదు. వైఎస్సార్ హయాంలో వ్యవసాయం రంగంలో 6.14 శాతం పెరుగుదల ఉంది. పారిశ్రామికరంగంలో 10.91 శాతం , సేవారంగాల్లో 10.06 శాతం పెరుగుదల నమోదు అయింది. చివరగా జీఎస్ డీపీ 9.56 శాతం గ్రోత్ రేట్ నమోదైంది. 

హీరోమోటార్స్  అని చెప్పి బాబు ఫోటోలకు ఫోజిచ్చాడు. ఏసియన్
పెయింట్స్ కు అదేమాదిరి ఫోజు ఇచ్చాడు. కిరణ్ ,బాబులు అప్పుడు కూడా ఫోటోలు దిగిన సందర్భాలు
చూశాం. ఇప్పుడు అడుగుతున్నా. హీరో మోటార్స్. ఏషియన్ సంస్థలు ఏమయ్యాయి బాబు. విశాఖలో
రెండేళ్లలో ఒక్కటంటే ఒక్క ఐటీ కంపెనీ తీసుకొచ్చారా బాబు..! ’’ అని వైఎస్
జగన్ నిలదీశారు.

చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న వైఖరి తో రాష్ట్రానికి దక్కాల్సిన ప్రయోజనాలు
అందటం లేదని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమయంలో ఐటీ శాఖ మంత్రి పల్లె
రఘునాథ రెడ్డి అడ్డు తగిలారు.

 

Back to Top