రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్న చంద్రబాబు

హైదరాబాద్ః ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ముస్సోరి పర్యటన దేనికోసమని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వరప్రసాద్‌ రావు ప్రశ్నించారు. అక్కడ ఐఏఎస్‌లకు ఏం శిక్షణ ఇస్తారని నిలదీశారు. కలెక్టర్ల వ్యవస్థను నిర్వీర్యం చేసింది చంద్రబాబు కాదా అని మండిపడ్డారు. అధికారాలన్నీ జన్మభూమి కమిటీలకు ఇచ్చింది నిజం కాదాఅని అన్నారు.

మస్సోరికి వెళ్లి చంద్రబాబు ఏం చెప్పాలనుకుంటున్నారని, ఆయన ఓ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహిరస్తున్నారని మండిపడ్డారు. పార్టీ నేతలు చెప్పినట్లు వినాలని బాబు అధికారులను భయపెడుతున్నారని మండిపడ్డారు. వ్యవస్థలు నీరుగార్చిన చంద్రబాబు ఇప్పుడు నీతులు చెబుతున్నారని ధ్వజమెత్తారు.
Back to Top