హంద్రీ - నీవా ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తున్న చంద్రబాబు

అనంతపురం: సీఎం చంద్రబాబుపై ఉరవకొండ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ సీపీ నాయకుడు వై విశ్వేశ్వరరెడ్డి శుక్రవారం అనంతపురంలో నిప్పులు చెరిగారు. చంద్రబాబు రాష్ట్రంలో కరువు ప్రాంతాలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అలాగే రాష్ట్రంలో సమస్యలు పరిష్కరించడం లేదని విమర్శించారు. టీడీపీకి పట్టం కట్టిన జిల్లాలో మాత్రమే చంద్రబాబు పర్యటిస్తున్నారు అన్నారు. హంద్రీ - నీవా ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని లక్ష సంతకాలు సేకరిస్తానని చెప్పారు. హంద్రీ - నీవాకు వెంటనే రూ. 2 వేల కోట్లు కేటాయించాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని వై విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు.
Back to Top