శ్వేతపత్రమా.. పసుపు పత్రమా?

సంపద లూటీలో చంద్రబాబు వరల్డ్ రికార్డ్
అవినీతిని తొక్కిపెట్టేందుకు రెండు న్యూస్ పేపర్లు
విచ్చలవిడిగా టీడీపీ నేతల ఇసుక దోపిడీ

హైదరాబాద్ః వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు రాష్ట్రంలో 13 జిల్లాల్లో గ్రామగ్రామాన ఇసుక మాఫియాను సృష్టిస్తున్నారన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు విచ్చలవిడిగా ఇసుకను లూటీ చేస్తూ కోట్లు గడిస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. టీడీపీ నేతల ఇసుకదోపిడీ గురించి ఈనాడులో పుంఖానుపుంఖాలుగా వెలువడిన సంచికను శ్రీకాంత్ రెడ్డి మీడియా ముందు ఉంచారు. రాయలసీమ నుంచి బెంగళూరుకు, విజయవాడ నుంచి తెలంగాణకు చంద్రబాబు రాష్ట్ర వనరులను దోచిపెడుతున్నారన్నారని శ్రీకాంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. 

పశుపత్రంగా శ్వేతపత్రం
రాష్ట్రాన్ని నిలువునా దోచుకుంటూ  తానేదో సచ్చీలుడన్నట్టు చంద్రబాబు గాంధేయవాదిలా మాట్లాడుతున్నారని శ్రీకాంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. 
చంద్రబాబు తన అక్రమాలు, అరాచకాలు, అబద్ధాలను తొక్కిపెట్టేందుకు రెండు పేపర్లను వాడుకుంటున్నారని శ్రీకాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. న్యూస్ పేపర్ , శ్వేతపత్రాల పేరుతో తన దోపిడీని దాచిపెడుతున్నారన్నారు. చంద్రబాబు నిజాలు చెప్పే శ్వేతపత్రాన్ని అసత్య పత్రంగా, ఓపసుపు పత్రంగా  మార్చారని దుయ్యబట్టారు. డ్వాక్రాసంఘాలకు ఇసుకరీచ్ లు అప్పజెప్పి లక్షాధికారులను చేస్తానన్న చంద్రబాబు ఇప్పటివరకు ఏ ఒక్కరినైనా లక్షాధికారిని చేశారా అని నిలదీశారు. డ్వాక్రా మహిళల పేరున టీడీపీ నేతలు చేస్తున్న దుర్మార్గాలు చూసి రాష్ట్రంలో మహిళలు అసహ్యించుకుంటున్నారన్నారు.

లూటీలో ప్రపంచ రికార్డ్
13 జిల్లాల వ్యాప్తంగా క్వారీలున్న ప్రతి చోట దోపిడీ జరగలేదని చెప్పే ధైర్యం ఉందా అని శ్రీకాంత్ రెడ్డి చంద్రబాబును ప్రశ్నించారు. ఒట్టిగొడ్డుకు అరుపులెక్కువ, చేతగాని ప్రభుత్వానికి శ్వేతపత్రాలు మక్కువ అన్నట్లు చంద్రబాబు పాలన సాగుతుందని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు . చంద్రబాబు తన 18నెలల పాలనలో సంపద లూటీలో ప్రపంచ రికార్డ్ నెలకొల్పారన్నారు. శ్రీకాకుళంలో రూ. 62 కోట్లు, కృష్ణాజిల్లాలో రూ.140 కోట్లు, పశ్చిమగోదావరి లో రూ. 114 కోట్లు వచ్చినట్లు ఇసుక ఆదాయం గురించి చెప్పిన చంద్రబాబు...అదేవిధంగా శ్రీకాకుళం లో మంత్రి అచ్చెన్నాయుడు , కృష్ణా జిల్లాలో మరో మంత్రి దేవినేనికి , పశ్చిమగోదావరి జిల్లాలో చింతమనేని ప్రభాకర్ , తూర్పుగోదావరి జిల్లాలో  ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడి కుటుంబాలకు ఇసుక ద్వారా ఎంత ఆదాయం వచ్చిందో చూపించి ఉంటే బాగుండేదని ఎద్దేవా చేశారు. 

కోర్టు మొట్టికాయలు వేస్తుందనే
మంత్రులతో పాటు టీడీపీకి చెందిన చోటామోటా నాయకులు చేస్తున్న అక్రమాలపై హైకోర్టును ఆశ్రయించినట్లు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. కోర్టు మొట్టికాయలు వేస్తుందనే చంద్రబాబు నూతన పాలసీ అంటూ మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. కొత్త పాలసీ వచ్చాక తన బినామీలకు దోపిడీ చేసుకునేందుకు చంద్రబాబు లైసెన్స్ లు ఇచ్చిన ఆశ్చర్యపడనక్కర్లే లేదన్నారు. చంద్రబాబు సర్కార్ దోపిడీ కారణంగా ఇసుక రేట్లు అమాంతం పెరిగిపోయి నిర్మాణాలు ఎక్కడివక్కడే ఆగిపోయాయని  శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. చంద్రబాబుకు ఎక్కడ కూడా దోపిడీని అరికడదాం, ప్రజలకు మంచిచేద్దామన్నఆలోచనే లేదన్నారు.   
Back to Top