చంద్రబాబు రాజీనామా చేయాలి

 ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబుకు సుప్రీంకోర్టు నోటీసులు
– న్యాయస్థానాలపై నమ్మకం పెరిగింది
– తప్పు ఎవరు చేసినా శిక్ష పడాల్పిందే
–వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే  ఆళ్ల రామకృష్ణారెడ్డి

అమరావతి: ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు ఇప్పటికైనా తన పదవికి రాజీనామా చేసి తాను నిర్దోషిని అని నిరూపించుకోవాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) డిమాండ్‌ చేశారు. ఓటుకు కోట్లు కేసుకు సంబంధించి హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ ఆర్కే సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్‌కు స్పందించిన న్యాయస్థానం చంద్రబాబుకు ఇవాళ నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి నిర్ణయంతో సామాన్యులకు, మాలాంటి వ్యక్తులకు నమ్మకం పెరిగిందని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో ఆర్కే  మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే..నాకు లోకస్‌ స్టాండ్‌ లేదని, ఏదైనా అక్రమం జరిగితే రస్‌ టూ ది కోర్టు అంటే కోర్టుకు వెళ్లి తెలియజెప్పండి అని అర్థం. అంతేకాకు 190 సెక్షన్‌ సీఆర్‌పీ ప్రకారం ఎక్కడైనా, ఎప్పుడైనా ఇలాంటి సాక్షాధారాలు కోర్టులో ప్రైవేట్‌ కంప్లెట్‌ వేయవచ్చు. సీఆర్‌పీసీ 39, 190 ప్రకారం నాకు లోకస్‌ స్టాండ్‌ లేదని హైకోర్టు కొట్టి వేసింది. అసలు క్రిమినల్‌ లాలో లోకస్‌ స్టాండ్‌ అనే పదమే లేదు. దీనిపై సుప్రీం కోర్టు తీర్పులు చాలానే ఉన్నాయి. సుబ్రహ్మణ్యం స్వామి వర్సెస్‌ మన్మోహన్‌సింగ్‌ కేసులో చాలా స్పష్టంగా కోర్టు తీర్పు ఇచ్చిందని ఆర్కే చెప్పారు.

 అన్నింటికంటే ప్రధానమై విషయం ఏంటంటే నిందితుడు, అనుమానితుడైన చంద్రబాబు చట్ట ప్రకారం  కోర్టుకు వెళ్లే అర్హతే లేదు. చార్జ్‌షిట్‌లో 22 సార్లు చంద్రబాబు పేరు ప్రస్తవానకు వచ్చింది. అయినా కూడా చార్జ్‌షిట్‌లో చంద్రబాబు పేరును నమోదు చేయలేదు. ఇప్పటికి కూడా చంద్రబాబు బ్రిప్డ్‌మీ అన్న వాయిస్‌ నాది కాదు అని ఎక్కడ చెప్పలేదు. నిజంగా చంద్రబాబు ఆ ఫోన్‌లో మాట్లాడకపోతే ఇప్పటికైనా టెస్ట్‌ చేసుకుపోండని చెప్పవచ్చు. అనుమానితుడైన చంద్రబాబు  న్యాయస్థానాలను ఆశ్రయించడం జరిగింది. చంద్రబాబు గురించి ప్రపంచానికి తెలుసు. వ్యవస్థలను ఎలా మ్యానేజ్‌ చేసుకుంటారన్నది అందరికీ తెలుసు. హైకోర్టు చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో నేను సుప్రీం కోర్టును ఆశ్రయించాను. సుప్రీం కోర్టు ఈ రోజు నోటీసులు జారీ చేసింది. ఏపీలో అన్యాయంగా, అక్రమంగా సంపాదించిన డబ్బుతో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు ఎమ్మెల్యేలను కొంటూ అడ్డంగా వీడియో, ఆడియో టేపులతో దొరికిపోయారు. సాక్ష్యాధారాలతో దొరికిపోయినా కూడా ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తూ ఆయన చేసిన ప్రక్రియను ప్రజలందరూ చూశారు. అయినా కూడా తెలంగాణ ఏసీబీ అధికారులు ఈ కేసును సరైన పద్ధతిలో తీసుకెళ్లని తరుణంలో గత మూడేళ్లుగా ఈ కేసు నత్తనడకన నడుస్తోందని ఆర్కే చెప్పారు. 

సీఆర్‌సీపీ చట్టంలోని 39, 190 ప్రకారం ఒక దేశ పౌరుడిగా తాను అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాను. మూడేళ్లుగా పోరాటం చేస్తున్నాను. సత్యమేవ జయతే. ఇవాల్టికైనా సరే సామాన్య పౌరులకు, మాలాంటి వాళ్లకు న్యాయస్థానాలపై గౌరవం, నమ్మకం పెరిగింది. రాజకీయాల్లో ఉన్న ప్రతి వ్యక్తికి విలువలు, విశ్వసనీయత ఉండాలి.  అలాంటి రాజకీయాలు చేసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే నాడు దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి, ఈ రోజు వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అని చెప్పగలను. ఒక్కటే కోరుకుంటున్నాను. తప్పు ఎవరు చేసినా నిష్పక్షపాతంగా శిక్షించబడాల్సిందే. ఈ రోజు అసెంబ్లీలో చంద్రబాబు గవర్నర్‌తో కనీసం మూడు పేజీల వివరణ మాకు ఇప్పించాడంటే... చెప్పేది శ్రీరంగ నీతులు, చేసేది ఏంటో అందరికి తెలుసు. తొలి అసెంబ్లీలో ఈ రోజు గవర్నర్‌ చేత ఇప్పించిన స్పీచ్‌కు చంద్రబాబు కట్టుబడి ఉండే వ్యక్తి అయితే తక్షణమే తన పదవికి రాజీనామా చేసి నిరూపించుకోవాలని ఆర్కే డిమాండ్ చేశారు. 

బాబు తప్పించుకోలేరు
ఓటుకు కోట్లు కేసు నుంచి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పించుకోలేరని ఆళ్ల రామకృష్ణా రెడ్డి తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్పారు. ఈ కేసులో తమకు కచ్చితంగా న్యాయం జరుగుతుందని, కేసు తీవ్రతను సుప్రీం కోర్టు గుర్తించిందని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. విచారణ సమయంలో కోర్టుకు వివరాలన్నీ సమర్పిస్తామని చెప్పారు.
Back to Top