వైయస్‌ జగన్‌ను చూసి వణుకుతున్న బాబు

  • బాబు, లోకేష్, ఇరిగేషన్ మంత్రుల నిధుల అనుసంధానం
  • కాగ్ నివేదికపై సీబీఐ ఎంక్వైరి వేసి బాధ్యులను శిక్షించాలి
  • అసెంబ్లీలో ప్రతిపక్షనేతను ఎదుర్కొనే దమ్ములేక టీడీపీలో వణుకు
  • వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి జోగిరమేష్ 
విజయవాడ: అసెంబ్లీలో ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడేందుకు నిలబడగానే చంద్రబాబుకు జ్వరం పడుతుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జోగి రమేష్‌ విమర్శించారు. ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు ప్రతిపక్షనేతకు సమయం ఇవ్వకుండా ప్రభుత్వం వాయిదాలు వేసుకొని పారిపోయిందని ఎద్దేవా చేశారు. విజయవాడ పార్టీ కార్యాలయంలో జోగి రమేష్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తాత్కాలిక ప్రాజెక్టులు, భవనాల పేరుతో ప్రజల సొమ్మును వృధాగా ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు. పట్టిసీమ ప్రాజెక్టు వల్ల ఏ విధమైన ఉపయోగం ఉండదని వైయస్‌ జగన్‌ ప్రభుత్వానికి సూచించినా.. ప్రభుత్వం వినిపించుకోలేదన్నారు. పట్టిసీమకు బదులు 45 టీఎంసీల కెపాసిటీ గల పులిచింతల ప్రాజెక్టుకు రూ. 120 కోట్లు కేటాయిస్తే బాగుటుందని వైయస్‌ జగన్‌ చెప్పారని గుర్తు చేశారు. ప్రతిపక్షనేత మాటలు పట్టించుకోకుండా రూ. వందల కోట్ల ప్రజా ధనాన్ని వృధా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్‌ జగన్‌ చెప్పినట్లుగానే కాగ్‌ రిపోర్టు పట్టిసీమ పనికిమాలిన ప్రాజెక్టు అని తేల్చి చెప్పిందని ఆరోపించారు. పట్టిసీమ పేరు చెప్పుకొని టీడీపీ నేతలు పప్పు బెల్లాల నిధులను పంచుకుతిన్నారని మండిపడ్డారు. నధుల అనుసంధానాలకు బదులుగా నిధులను అనుసంధానం చేసుకొని చంద్రబాబు, లోకేష్, ఇరిగేషన్‌ మంత్రి పంచుకున్నారన్నారు. 

పట్టిసీమ పేరు చెప్పుకొని టీడీపీ నేతలు రూ. 339 కోట్లు దోచుకుతిన్నారని కాగ్‌ రిపోర్టు వెల్లడించిందని జోగి రమేష్‌ అన్నారు. ప్రజా సొమ్మును పంచుకొని తినడానికి అదేమైనా మీ బాబు సొమ్మా అని చంద్రబాబు, మంత్రి దేవినేనిని ప్రశ్నించారు. పట్టిసీమ పేరుతో రూ. 1600 కోట్లు, పురుషోత్తపట్నం ప్రాజెక్టుకు రూ. 22 వందల కోట్లు, చింతలపుడి ప్రాజెక్టుకు రూ. 1600 కోట్లు వృధాగా ఖర్చు చేస్తున్నారని చెప్పారు. కాగ్‌ రిపోర్ట్‌కు ఎవరు బాధ్యత వహిస్తారని చంద్రబాబును ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతను అసెంబ్లీలో ఎదుర్కొనే దమ్మూ, ధైర్యం లేక టీడీపీకి వణుకుపుడుతోందన్నారు. రైతు రుణమాఫీ కూడా బూటకమని కాగ్‌ వెల్లడించడిందన్నారు. కాగ్‌ రిపోర్టుపై సీబీఐ ఎంక్వైరీ వేసి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. లేదా చంద్రబాబు, ఇరిగేషన్‌ మంత్రి దేవినేని నైతిక బాధ్యత వహించి పదవులకు రాజీనామాలు చేయాలని డిమాండ్‌ చేశారు. 
Back to Top