ఇంత నీచ నికృష్ట సీఎం ఎక్కడా ఉండడు

  • ఏపీలో ప్రజాస్వామ్యం అపహాస్యానికి గురైంది
  • వేలంపాట లాగ బాబు ప్రజాప్రతినిధులను కొనేశాడు
  • వినని వారిని పోలీసులతో కిడ్నాప్ చేయించాడు
  • ఇంత దుర్మార్గపు ఆలోచనలున్న మనిషి దేశంలో ఎక్కడా ఉండడు
  • వైయస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
అమరావతి: రాజ్యాంగాన్ని కాపాడుతానని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తానని భగవద్గీత మీద ప్రమాణం చేసి ఒక్క పర్సెంట్‌ కూడా పాటించని నీచ, నికృష్టపు ముఖ్యమంత్రి ఎక్కడా ఉండడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడుతూ... చంద్రబాబు ప్రభుత్వ ప్రలోభ రాజకీయాలపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా మహాత్మగాంధీ సాధించిన ప్రజాస్వామ్యం కొనుగోలుగాబడి అపహాస్యానికి గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా.. లేక పాకిస్తాన్‌లో ఉన్నమా అనే అనుమానం కలుగుతుందన్నారు. ప్రజాస్వామ్య విలువలు దిగజారిపోయాయన్నారు. చంద్రబాబు ప్రలోభ రాజకీయాలతో భారతమాత సిగ్గుతో తలదించుకునే దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేలంపాట లాగా వందల కోట్లు ఖర్చు చేసి చంద్రబాబు ప్రజాప్రతినిధులను కొనుగోలు చేశాడని మండిపడ్డారు. ఇంత దుర్మార్గపు ఆలోచనలు ఉన్న మనిషి దేశంలోనే ఎక్కడా దొరకడని ఎద్దేవా చేశారు. మూడు సింహాలు నెత్తిన పెట్టుకునే పోలీసులను పెట్టుకొని ప్రజా ప్రతినిధులను కిడ్నాప్‌ చేయించారని ఆరోపించారు. పోలీసులు కూడా సిగ్గుతో తలదించుకోవాలన్నారు. కడప జిల్లాలో గెలుపు కోసం ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులను కూడా ప్రత్యేక విమానాల్లో తిప్పారని ఫైర్ అయ్యారు. 

కడప జిల్లా ఇన్‌చార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చ జరుగుతుంటే సమావేశాలకు హాజరుకాకుండా అక్కడ తిష్టవేసి దుర్మార్గపు రాజకీయాలు చేశారని ధ్వజమెత్తారు. టీడీపీ ప్రలోభాలకు లొంగకపోతే ఓటర్ల కుటుంబసభ్యులను కూడా వదలకుండా బెదిరింపులకు పాల్పడ్డారని దుయ్యబట్టారు. నీచ పనులు చేశామని తలదించుకోవాల్సిందిపోయి సంబరాలు చేసుకుంటారా.. ?దీన్ని గెలుపంటారా..? అని ప్రశ్నించారు. చంద్రబాబుకు దమ్ముంటే 21 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వస్తారా లేక.. ప్రలోభాలకు గురిచేసిన ఎంపీటీసీ, జెడ్పీటీసీలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వస్తారా..? అని సవాల్ విసిరారు. 
Back to Top