మహిళలపై ఆకృత్యాల్లో ఏపీ అగ్రస్థానంవైయ‌స్ఆర్ జిల్లా  : మ‌హిళలపై ఆకృత్యాల్లో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే అగ్రస్థానంలో నిలవడం సిగ్గుచేటని వైయ‌స్‌ఆర్‌సీపీ మహిళా విభాగం క‌డ‌ప‌ నగర అధ్యక్షురాలు టీపీ వెంకటసుబ్బమ్మ అన్నారు. ఆమె  విలేకరులతొ  మాట్లాడుతూ టీడీపీ పాలనలో బాలికలు, మహిళలపై దాడులు, అత్యాచారాలు అధికమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. తొమ్మిదేళ్ల   చంద్రబాబుకు రాజకీయాలపై ఉన్న శ్రద్ద మహిళల రక్షణపై లేదన్నారు.  గతంలో కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌ను టీడీపీ పెద్దలే నడిపించారని, సీఎం కూడా వారికే వత్తాసు పలికారన్నారు. తహసీల్దార్‌ వనజాక్షిని టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ జుట్టుపట్టి ఈడిస్తే ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదన్నారను. ప్రభుత్వ ఆదాయం కోసం రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం షాపులు పెట్టి మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని ధ్వజమెత్తారు.  

 
Back to Top