అవినీతి అంటేనే చంద్రబాబు

  • బాబు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ
  • రెండకరాల నుంచి 2లక్షల కోట్ల అవినీతి
  • సర్పంచ్ మొదలు ముఖ్యమంత్రిదాక రాష్ట్రాన్ని దోచేస్తున్నారు
  • హోదా కోసం పోరాడుతున్న ప్రతిపక్ష నేతను విమర్శిస్తారా
  • రానున్న ఎన్నికల్లో బాబుకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారు
  • వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి వెల్లంపల్లి శ్రీనివాస్ 
విజయవాడః చంద్రబాబు రాష్ట్రాన్ని అవినీతిమయం చేశాడని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు.  ప్రత్యేకహోదా కోసం ప్రజల పక్షాన పోరాడుతున్న ప్రతిపక్ష నేతను విమర్శించే అర్హత టీడీపీ నేతలకు లేదని అన్నారు. అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో ప్రజలకు  ఏమీ చేయలేక బాబు, మంత్రులు వైయస్ జగన్ పై పిచ్చి ప్రేలాపణలు పేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ. 2లక్షల కోట్లకు పైగా అవినీతి చేసిన చంద్రబాబుకు వైయస్ జగన్ గురించి మాట్లాడే అర్హత లేదని విజయవాడలోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వెల్లంపల్లి వ్యాఖ్యానించారు. హోదా కోసం అవసరమైతే తమ పార్టీ ఎంపీలతో రాజీనామా చేయిస్తానని తమ అధినేత చెప్పిన విషయాన్ని వెల్లంపల్లి గుర్తు చేశారు. చంద్రబాబుకు దమ్మూ, ధైర్యం ఉంటే అనైతికంగా చేర్చుకున్న 21మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని వెల్లంపల్లి సవాల్ విసిరారు. ఎంపీలతో రాజీనామా చేయిస్తానని కేంద్రానికి అల్టిమేటం ఇచ్చే సత్తా బాబుకు ఉందా అని ప్రశ్నించారు.  

జనం అభిప్రాయం ప్రకారం వైయస్ జగన్ హోదా మీద పోరాడుతున్నారని... పై చేయి మీదో, మాదో ఎన్నికల్లో తేల్చుకుందామని టీడీపీకి చురక అంటించారు. యువభేరిలో వేలాది మంది యువకులు పాల్గొని ప్రశ్నలేస్తుంటే సిగ్గుగా లేదా బాబు మీకు..? వారి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వైయస్ జగన్ ను ఆడిపోసుకోవడం సిగ్గుచేటన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా వైయస్ జగన్ ధీరుడిలా రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాడుతుంటే బాబు భయపడుతున్నారని అన్నారు. కేంద్రాన్ని హోదా అడిగితే ఓటుకు నోటు కేసులో అరెస్ట్ చేసి అవినీతిని బయటపెడతారని భయపడి కేంద్రం పాదాల వద్ద తాకట్టుపెట్టాడని చంద్రబాబుపై వెల్లంపల్లి నిప్పులు చెరిగారు. ఆ రోజు అధికారం కోసం మామకు వెన్నుపోటు పొడిచాడు . ఇవాళ హోదాను తాకట్టుపెట్టి ఏపీ ప్రజలకు వెన్నుపోటు పొడిచాడని విరుచుకుపడ్డారు. 

మున్సిపాలిటీ. కార్పొరేషన్ ఎన్నికలు పెట్టలేని అసమర్థ ప్రభుత్వం రాష్ట్రంలో ఉందని ఎద్దేవా చేశారు. ప్రజల్లోకి వెళ్లలేరు, సేవ చేయలేరని టీడీపీపై మండిపడ్డారు. బాబు, మంత్రులు వైయస్ జగన్ పై అవాకులు, చెవాకులు పేలడం మాని ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని సూచించారు.  వైయస్ జగన్ ను తిట్టడమే అజెండాగా పెట్టుకుంటే రాబోవు రోజుల్లో బాబును ప్రజలు తిరస్కరించడం ఖాయమని అన్నారు.  బాబు లాగ జగన్ భయపడే వ్యక్తి కాదని వెల్లంపల్లి స్పష్టం చేశారు. చక్కని పథకాలు అందించి మహానేత వైయస్ఆర్ ప్రజల చేత దేవుడిగా కీర్తించబడ్డారని చెప్పారు. బాబును ప్రజలు దెయ్యంలాగ, రాష్ట్రానికి పట్టిన చీడలాగ భావిస్తున్నారని పేర్కొన్నారు. 

వైయస్ఆర్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, ఫీజురీయింబర్స్ మెంట్ పథకాలు తీసేశానని చెప్పడం తప్ప...  మీరు చెప్పుకోదగ్గ పథకాలు ప్రజలకు ఏంచేశారని నిలదీశారు. ఏమీ చేయకుండా రైతులు, యువత, డ్వాక్రామహిళలు అందర్నీ బాధపెట్టి ఎవరికోసం పరిపాలన సాగిస్తున్నారు బాబు....మీ బిడ్డ, కుటుంబంకోసమా.? సర్పంచ్ మొదలు సీఎం వరకు మట్టి మొదలు గాలివరకు అంతా అవినీతేనని దుయ్యబట్టారు. అవినీతి అంటేనే చంద్రబాబు అని చెప్పారు.  బాబు తన అవినీతిని బయటపెట్టిన నాయకులపై బురదజల్లడం, పోలీసు జులుం ప్రదర్శించడం ఎంతోకాలం సాగదని అన్నారు. బాబు ప్రజల ఆవేశానికి గురికాక తప్పదని హెచ్చరించారు. వైయస్ జగన్ నాయకత్వంలో రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.  

Back to Top