చంద్రబాబు మళ్లీ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం

కృష్ణా జిల్లా : ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీక్ష పేరుతో మ‌ళ్లీ ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని, ఆయ‌న‌కు చిత్తశుద్ధి లేదని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. ఆయన గురువారం జాతీయ మీడియా ఏఎన్‌ఐతో మాట్లాడుతూ... వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీల రాజీనామాలను పక్కదారి పట్టించడానికే చంద్రబాబు దీక్ష చేస్తున్నారని విమర్శించారు.  హోదా కోసం వైయ‌స్ఆర్‌ సీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసి, ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారని వైయ‌స్ జ‌గ‌న్ గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 25 మంది ఎంపీలు రాజీనామా చేస్తే హోదాపై దేశవ్యాప్త చర్చ జరిగేదని ఆయన అన్నారు.  


Back to Top