పింగళి దశరథ్, వంగవీటి రంగాను హత్య చేయించింది చంద్రబాబే

నంద్యాల: కాపులపై చంద్రబాబు కపట ప్రేమ చూపిస్తున్నారని వైయస్సార్సీపీ నేతలు వంగవీటి రాధాకృష్ణ, కిలారి రోశయ్యలు మండిపడ్డారు. బాబు తానా అంటే తందానా అనే బ్యాచ్‌తో కాపు సమావేశం పెట్టి కొత్త డ్రామాకు తెరలేపారని విమర్ళించారు. కాపులు రాజకీయ రిజర్వేషన్లు కోరుకోవడం లేదంటూ చంద్రబాబు చిలక పలుకులు పలుకుతున్నారని ఫైర్ అయ్యారు. అధికారంలోకి రాకముందు కాపులను బీసీల్లో చేరుస్తామన్న హామీ ఏమైంది..?అని ప్రశ్నించారు. ముద్రగడ పాదయాత్రకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదు..?అని నిలదీసారు. కాపులను ఎందుకు అరెస్ట్‌లు చేసి బైండోవర్ చేస్తున్నారని కడిగిపారేశారు. పింగలి దశరథ్, వంగవీటి రంగాను హత్య చేయించింది చంద్రబాబేనని రాధా, రోశయ్యలు ధ్వజమెత్తారు. నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో చంద్రబాబుకు కాపులు బుద్ధి చెప్తారని అన్నారు. 

Back to Top