2019 ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటమి తప్పదు

వెంకటాచలం: 2019ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటమి తప్పదని జెడ్పీటీసీ మందల వెంకటశేషయ్య హెచ్చరించారు. వెంకటాచలంలో మంగళవారం ఉదయం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. నంద్యాల ఉప ఎన్నికల్లో తన అధికారాన్ని అడ్డంపెట్టుకుని చంద్రబాబు బ్లాక్‌మెయిల్‌ చేయడంతో టిడిపి అభ్యర్థి గెలవడం జరిగిందన్నారు. ఉప ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన 2019 సాధారణ ఎన్నికల్లో ప్రజలు మద్దతు టిడిపి ఇవ్వరనే విషయాన్ని ఆపార్టీ నాయకులు తెలుసుకోవాలన్నారు. విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేయడం, ఓటు వేయకపోతే అభివృద్ది చేయనివ్వనని ఓటర్లును భయపెట్టే సంస్కృతిని టిడిపి తీసుకురావడం సిగ్గుచేటన్నారు. అధికారం చేతిలో ఉండటంతో ప్రజలు కూడా భయపడి ఓట్లు వేశారనే విషయాన్ని టిడిపి నాయకులు తెలుసుకోవాలని సూచించారు. చంద్రబాబు వైఫల్యాలుకు భవిష్యత్‌ ఎన్నికల్లో మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. టిడిపి నాయకులు బాణాసంచాలు కాల్చి సంబరాలు మానుకుని గ్రామాల్లో అభివృద్ది పనులపై దృష్టిపెడితే మంచిదన్నారు. ఈసమావేశంలో మండల కోఆప్షన్‌ సభ్యులు హుస్సేన్, వైఎస్‌ఆర్‌సీపి ఎస్సీసెల్‌ జిల్లా ప్రధానకార్యదర్శి అడపాల ఏడుకొండలు పాల్గొన్నారు.

Back to Top